ప్రొడ్యూస‌ర్స్‌కు వారు భారం అవుతున్నారా?

పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహంతో తెలుగు సినిమా బ‌డ్జెట్‌తో పాటు మార్కెట్ కూడా భారీ స్థాయికి చేరుకుంటి.;

Update: 2026-03-09 10:39 GMT

పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహంతో తెలుగు సినిమా బ‌డ్జెట్‌తో పాటు మార్కెట్ కూడా భారీ స్థాయికి చేరుకుంటి. దీంతో ఒక్కో హీరో రికార్డు స్థాయిలో పారితోషికాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ త‌రువాత దీని ప్ర‌భావం మ‌రింత‌గా పెరిగింది. స్టార్ హీరోలే అంతంత తీసుకుంటుంటే మేం మాత్రం త‌క్కువ తిన్నామా అన్న‌ట్టుగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు కూడా పారితోషికాల‌ని భారీగా పెంచేశారు. అంతేనా సెప‌రేట్ క్యార‌వాన్‌లు, డ్రైవ‌ర్‌లు, వెహికిల్స్‌, ప్ర‌త్యేక సిబ్బంది త‌దిత‌ర డిమాండ్‌ల‌తో ఇప్పుడు నిర్మాత‌ల‌కు వాచిపోతోంది.

దీనిపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, నిర్మాత‌లు చ‌ర్చించాల‌నే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ నెల 12న బెంగ‌ళూరులో ద‌క్షిణాది ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌కు సంబంధించిన ఫిల్మ్ ఛాంబ‌ర్స్ వ‌ర్గాల‌కు సంబంధించిన ఓ కీలక స‌మావేశం జ‌రగ‌బోతోంది. ఇందులో ప‌లు అంశాల‌కు సంబంధించిన చ‌ర్చ జ‌ర‌గనుంది. ఇదే సంద‌ర్భంగా సిబ్బందికి సంబంధించిన వేత‌నాలు, ర‌వాణా వాహ‌నాల ఖ‌ర్చుకు సంబంధించిన ఓ ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యం తీసుకుంటే మంచిద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

కోవిడ్ త‌రువాత స్టార్ హీరోల‌తో పాటు న‌టీన‌టుల వేత‌నాలు భారీ స్థాయిలో పెరిగాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే వారి సిబ్బంది ఖ‌ర్చులు కూడా త‌డిసిమోపెడు కావ‌డంతో నిర్మాత‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టార్‌ల‌, క్యారెక్ట్ ఆర్టిస్ట్‌ల వేత‌నాల విష‌యంలో డిమాండ్ అండ్ స‌ప్లైయ్ ని బ‌ట్టి ఖ‌ర్చు చేస్తున్నామ‌ని స‌రిపెట్టుకుంటున్నా.. సిబ్బందికి సంబంధించిన ఖ‌ర్చుల విష‌యంలో మాత్రం రాజీప‌డ‌లేక‌పోతున్నార‌ట‌. ఒక్కో సినిమాకు ఆర్టిస్ట్‌ల సిబ్బందికే ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ట‌.

40 రోజుల షెడ్యూల్‌తో సినిమా చేస్తే ఆర్టిస్ట్‌ల సిబ్బంది వాహ‌నాలు, ఎక్స్ట్రా ఖ‌ర్చులు, బేటాల‌కే 40 ల‌క్ష‌ల‌కు పైనే ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోందట‌. ఇదే ఇప్పుడు నిర్మాత‌ల‌ని తీవ్ర అస‌హ‌నానికి గురి చేస్తున్న‌ట్టుగా టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఒక్కో ఆర్టిస్ట్ త‌న స‌హాయ‌కుడికి 15వేల‌కు పైనే వ‌సూలు చేస్తున్నార‌ట‌. ఇక స్టార్‌లు త‌మ వ్య‌క్తిగ‌త సిబ్బందికి రోజుకు 25 వేలు డిమాండ్ చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా వారి ప్ర‌యాణ ఖ‌ర్చులు, భోజ‌నం ఖ‌ర్చులు అద‌నం. అంతే కాకుండా ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ తిన‌కుండా బ‌య‌టికి నుంచి అర్డ‌ర్ పెట్టి తెప్పించుకుంటూ ఆ ఖ‌ర్చులు కూడా నిర్మాత‌నే బాదేస్తున్నార‌ట‌.

దీంతో ఏం చేయాలో తెలియ‌క నిర్మాత త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ని చెబుతున్నారు. ఎక్స్‌ట్నా వెహికిల్స్ కూడా ఇప్పుడు త‌ల‌కు మించిన భారంగా మారాయని, స‌మాయ న‌టులు కూడా త‌మ‌కో కారు, త‌మ సిబ్బందికో కారు అడుగుతూ ఆ ఖ‌ర్చుని కూడా త‌మ‌మీదే వేస్తున్నార‌ని నిర్మాత‌లు వాపోతున్నారు. దీనికి ఎట్టిప‌రిస్థితుల్లోనూ చెక్ పెట్టాల‌నే నిర్ణ‌యానికి నిర్మాత‌లు వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మార్చి 12న బెంగ‌ళూరుల జ‌రిగే ద‌క్షిణాది ఫిల్మ్ ఛాంబ‌ర్‌ల స‌మావేశంలో ఈ స‌మ‌స్య‌తో పాటు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై కూడా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోన్నార‌ట‌.

Tags:    

Similar News