పాన్ ఇండియా టాలీవుడ్‌ని ముంచేస్తోందా?

జ‌క్క‌న్న ఏ క్ష‌ణాన `బాహుబ‌లి`తో పాన్ ఇండియా సినిమాల‌కు తెర లేపాడో కానీ ఇప్పుడు అంతా దీని వెంటే ప‌రుగులు పెడుతున్నారు. ఏ హీరోని క‌దిలించినా పాన్ ఇండియా జ‌ప‌మే చేస్తున్నారు.

Update: 2026-07-01 14:30 GMT

జ‌క్క‌న్న ఏ క్ష‌ణాన `బాహుబ‌లి`తో పాన్ ఇండియా సినిమాల‌కు తెర లేపాడో కానీ ఇప్పుడు అంతా దీని వెంటే ప‌రుగులు పెడుతున్నారు. ఏ హీరోని క‌దిలించినా పాన్ ఇండియా జ‌ప‌మే చేస్తున్నారు. దీంతో సినిమాల బ‌డ్జెట్ లు కూడా ఆకాశాన్ని తాకేస్తున్న‌యి. కానీ స‌క్సెస్ రేటు మాత్రం అనుకున్న స్థాయిలో ఉండ‌టం లేదు. వంద‌ల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నా ఒక‌టో రెండో స‌క్సెస్ అవుతున్నాయే కానీ వావ్ అనిపించే స్థాయిలో మాత్రం స‌క్సెస్ కావ‌డం లేదు.

దీంతో స్టార్ ప్రొడ్యూస‌ర్లు సైతం పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్ట‌ర్‌ని న‌మ్మి స్టార్ ప్రొడ్యూస‌ర్ చేసిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచి ప్రొడ్యూస‌ర్‌గా తిరుగులేని పేరున్న వారి అస్తిత్వాన్ని, వారి బ్యాన‌ర్ భ‌విష్య‌త్తును ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డేసింది. వంద‌ల కోట్లు న‌ష్టం రావ‌డంతో ఇక స‌ద‌రు సినిమా కంప‌నీ ఎత్తేయాల్సిందేన‌నే కామెంట్‌లు కూడా వినిపించాయి. స‌ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్ కూడా ఇదే జ‌రుగుతుంద‌ని ఊహించాడు.

కానీ స్టార్ హీరో సినిమాతో వంద‌ల కోట్లు న‌ష్ట‌పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న స‌ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్‌ని ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బ్ర‌తికించింది. మ‌ళ్లీ మార్కెట్‌లో త‌లెత్తుకుని నిల‌బ‌డేలా చేసింది. ఈ ఉదంతం నేప‌థ్యంలో చాలా మంది ప్రొడ్యూస‌ర్‌లు పాన్ ఇండియా అంటే ఇప్పుడు భ‌య‌ప‌డుతున్నారు. భారీ సినిమా అంటూ అత్యాశ‌కు పోకుండా చిన్న సినిమాలు చేసుకోవ‌డం బెట‌ర్ అని భావిస్తున్నారు.

`బాహుబ‌లి`కి ముందు ఏ హీరో, ఏ డైరెక్ట‌ర్ పాన్ ఇండియా అనే మాటే ఎత్త‌లేదు. అయితే త‌రువాత మారిన మార్కెట్ కార‌ణంగా పాన్ ఇండియా జ‌పం చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ని ముంచేస్తోందానే వాద‌న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాల పేరుతో డైరెక్ట‌ర్లు, హీరోలు రెండేళ్ల‌కు ఒక సినిమా చేస్తే థియేట‌ర్లకు ఫీడింగ్ ఉండ‌ద‌ని, ఇదే ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే సింగిల్ స్క్రీన్‌ల వ్య‌వ‌స్థ మొత్తానికే ప‌త‌నం అయి సినిమా ఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదంగా మారే అవ‌కాశం ఉంద‌ని వాపోతున్నారు.

ఆ ప్ర‌మాదంలో ఇండ‌స్ట్రీ ప‌డ‌కూడ‌ద‌ని కొంత మంది స్టార్ ప్రొడ్యూర్లు చిన్న సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. డైరెక్ట్‌గా కానీ ఇండైరెక్ట్‌గా కానీ చిన్న సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటూ కొత్త త‌ర‌హా సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. దీంతో కొత్త త‌ర‌హా సినిమాల ప్ర‌వాహం మొద‌ల‌వుతోంది. కానీ కొంత మంది మాత్రం ఇప్ప‌టికీ పాన్ ఇండియా సినిమాల‌నే న‌మ్ముకుంటున్నారు. ఓటీటీల కార‌ణంగా చిన్న సినిమాల కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డంతో స్టార్ ప్రొడ్యూస‌ర్లు పాన్ ఇండియా సినిమాలు చేయాల‌నే ఆస‌క్తి లేక‌పోయినా వాటినే ఎంచుకుంటూ చేతులు కాల్చుకుంటున్నారు.

Tags:    

Similar News