బ్యాక్‌‌గ్రౌండ్‌కు భిన్నంగా వెలుగులోకి వస్తున్న ప్రతిభ!

నేడు ఏ చిత్ర పరిశ్రమలోనూ గతంలో లాంటి సంపూర్ణ గుత్తాధిపత్యం ..పక్షపాత రాజకీయాలు కొనసాగడం లేదు.

Update: 2026-10-01 04:15 GMT

చలనచిత్ర పరిశ్రమ వెండితెరపై అద్భుతాలను సృష్టిస్తుంటే? తెరవెనుక కొన్నిసార్లు వ్యూహాలు, రాజకీయాల వలయాలు నడుస్తుంటాయి. గ్లామర్ ప్రపంచంగా కనిపించే ఈ రంగానికి ఒక గతం, వర్తమానం ఉందంటే దాని వెనుక ఎన్నో అంతర్గత సమీకరణాలు, బేరసారాలుంటాయి. ప్రతిభతో పాటు ఆధిపత్య సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇండస్ట్రీ పాలిటిక్స్‌కు ఒకప్పుడు ప్రధాన ఆధారంలా ఉండేవి. ఒక ప్రాజెక్ట్‌లోకి ఎవరిని తీసుకోవాలి? ఏ హీరో సినిమా ఏ పండగకు రావాలి? థియేటర్ల కేటాయింపు ఎలా ? ఉండాలనే విషయాలపై జరిగే లాబీయింగ్ రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. షూటింగ్ మొదలైన తర్వాత బలవంతపు మార్పులు చేయడం, ఎవరి నీడలో ఎవరు ఉండాలనే నిబంధనలు కూడా గతంలో సర్వసాధారణంగా కనిపించేవి. ఎంతో మంది ప్రతిభావంతులు అంతర్గత రాజకీయాల ఒత్తిడికి తట్టుకోలేక పరిశ్రమను వీడిన దాఖలాలు కూడా ఉన్నాయి.

అయితే కాలం మారుతున్న కొద్ది ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా వరకు మారాయి. నేడు ఏ చిత్ర పరిశ్రమలోనూ గతంలో లాంటి సంపూర్ణ గుత్తాధిపత్యం ..పక్షపాత రాజకీయాలు కొనసాగడం లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడు పూర్తిగా ట్యాలెంట్ కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియా .. డిజిటల్ యుగం వచ్చాక ప్రతిభ ఎక్కడా దాగి ఉండట్లేదు. చిన్న రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ , ప్రయోగాత్మక కంటెంట్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న యువతను నేరుగా పెద్ద నిర్మాణ సంస్థలు, అగ్ర దర్శకులే పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదా గాడ్ ఫాదర్స్ లేని సాధారణ మధ్యతరగతి యువతీ యువకులు సైతం అద్భు తమైన నటనతో, దర్శకత్వ ప్రతిభతో ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకుంటున్నారు. నూతన నటీనటులకు, టెక్నీషియన్లకు అన్ని విభాగాల్లోనూ సమాన అవకాశాలు లభిస్తున్నాయి. అలాగని పరిశ్రమలో పూర్తిగా రాజకీయాలు లేవని చెప్పలేం.

ఎక్కడైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు చిన్నపాటి ఒడిదుడుకులు, వ్యూహాలు ఉండటం సహజం. కానీ గతంతో పోలిస్తే నేడు ఆ రాజకీయాల ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. ప్రేక్షకుల్లో కూడా అభిరుచి మారింది. కేవలం పెద్ద బ్యానర్లు లేదా స్టార్స్ ఉన్నంత మాత్రాన సరిపోదని కంటెంట్ బాగుంటేనే ఆదరిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఐదారేళ్ల కాలంలో కాంబినేష‌న్లు కంటే? కంటెంట్ కి ఏ రేంజ్ లో ప్రాధాన్య‌త ఇస్తున్నారు అన్న‌ది కొన్ని చిన్న సినిమాల స‌క్సస్ ను బ‌ట్టే అద్దం ప‌డుతోంది. ఈ కాలంలో చాలా మంది యువ ప్ర‌తిభావంతులు ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయ్యారు.

అంతిమంగా సినిమా పరిశ్రమ అనేది అందమైన వలయం. తెరవెనుక ఎన్ని రాజకీయాలు, సవాళ్లు ఉన్నా? అంతిమంగా ప్రతిభే గెలుస్తుంది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కంటెంట్ ఏ రూపంలో వచ్చినా ఇండస్ట్రీ దాన్ని సాదరంగా ఆహ్వానిస్తుంది. పాత పద్ధతులు కనుమరుగై నైపుణ్యానికి పట్టం కట్టే సరికొత్త ఆరోగ్యకరమైన వాతావరణం నేడు అన్ని చిత్ర పరిశ్రమలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్ర‌త్యేకించి టాలీవుడ్ లో ఈ మార్పు స్ప‌ష్టంగా ఉందన్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News