వాయిదా ప‌డిన డిసెంబ‌ర్ సినిమాలు

సినీ ఇండ‌స్ట్రీలో కూడా ఒక సినిమా రిలీజ్ డేట్ మ‌రెన్నో సినిమాల రిలీజ్ డేట్స్ ను డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈ మ‌ధ్య టాలీవుడ్ లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువైపోయింది.;

Update: 2025-12-11 13:54 GMT

నేచ‌ర్ లో ఎక్క‌డో జ‌రిగే మూమెంట్ మ‌రెక్క‌డో జ‌రిగే మూమెంట్ ను డిసైడ్ చేస్తుంద‌ని, దాన్నే బ‌ట‌ర్ ఫ్లై ఎఫెక్ట్ అంటార‌ని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది ముమ్మాటికీ నిజ‌మే. సినీ ఇండ‌స్ట్రీలో కూడా ఒక సినిమా రిలీజ్ డేట్ మ‌రెన్నో సినిమాల రిలీజ్ డేట్స్ ను డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈ మ‌ధ్య టాలీవుడ్ లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువైపోయింది.

అఖండ‌2 డిసెంబ‌ర్ 5 నుంచి డిసెంబ‌ర్ 12కి వాయిదా

వాస్త‌వానికి డిసెంబ‌ర్ నెల‌లో ప‌లు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ముందుగా డిసెంబ‌ర్ 5కి నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అఖండ‌2 తాండ‌వం వ‌స్తుంద‌ని అనౌన్స్ చేశారు. దీంతో ప‌లు చిన్న సినిమాలు త‌మ రిలీజ్‌ల‌ను దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నాయి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అఖండ‌2 డిసెంబ‌ర్ 5న రిలీజ్ అవ‌కుండా వాయిదా ప‌డి డిసెంబ‌ర్ 12కి షిఫ్ట్ అయింది.

దీంతో ఎన్నో సినిమాలు త‌మ రిలీజ్ డేట్ల‌ను మార్చుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. డిసెంబ‌ర్ 12న రిలీజవాల్సిన మోగ్లీ సినిమా ఒక రోజు ఆల‌స్యంగా డిసెంబ‌ర్ 13న రిలీజ‌వుతుండ‌గా, డిసెంబ‌ర్ 6న రిలీజ‌వాల్సిన శ‌ర్వానంద్ బైక‌ర్ మూవీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డింది. ఈషా అనే హార్ర‌ర్ మూవీ డిసెంబ‌ర్ 12న రావాల్సి ఉండ‌గా అఖండ‌2 వ‌స్తుండ‌టంతో దాన్ని డిసెంబ‌ర్ 25కి పోస్ట్‌పోన్ చేశారు.

పోస్ట్ పోన్ అయిన అన్న‌గారు వ‌స్తారు

డిసెంబ‌ర్ 12న రిలీజ‌వాల్సిన సైక్ సిద్ధార్థ అనే సినిమా కూడా అఖండ‌2 తో పోటీ వ‌ద్ద‌నుకుని త‌మ సినిమాను వాయిదా వేసుకుని జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఇక కార్తీ న‌టించిన అన్న‌గారు వ‌స్తారు సినిమా డిసెంబ‌ర్ 12 నుంచి వాయిదా అయితే ప‌డింది కానీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది మాత్రం మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయ‌లేదు. అడివి శేష్ డెకాయిట్ ఈ నెల 25న రిలీజవాల్సి ఉండ‌గా షూటింగ్ లేట‌వ‌డం వ‌ల్ల ఆ సినిమా వ‌చ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుంది. అంతేకాదు, గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న యూఫోరియా సినిమా కూడా డిసెంబ‌ర్ 25 నుంచి నెక్ట్స్ ఇయ‌ర్ ఫిబ్ర‌వరి 6కి వాయిదా ప‌డింది. డిసెంబ‌ర్ 18న రిలీజ్ కావాల్సిన ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూఆ వాయిదా ప‌డింది కానీ ఇంకా కొత్త రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌లేదు.

Tags:    

Similar News