• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేన్స్ 2025లో టాలీవుడ్...

కేన్స్ 2025లో టాలీవుడ్ ఎక్క‌డ‌?

| ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ 2025 ఉత్సవాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. కేన్స్ న‌గ‌రం రంగుల హ‌రివిల్లులా మారింది.

By - Tupaki Desk
Update: 2025-05-17 04:17 GMT

ప్ర‌తిష్ఠాత్మ‌క కేన్స్ 2025 ఉత్సవాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. కేన్స్ న‌గ‌రం రంగుల హ‌రివిల్లులా మారింది. అక్క‌డ దేశ విదేశాల నుంచి స్టార్ల సంద‌డి క‌నిపిస్తోంది. వ‌రుస‌గా సినిమాల ప్రీమియ‌ర్ల‌తో వేదిక ఎంతో వైభ‌వంగా మారింది. రెండు వారాల పాటు సాగే ఈ ఉత్స‌వాల‌కు చాలా దేశాల నుంచి సినీప్ర‌ముఖులు విచ్చేసి ఇక్క‌డ ప్ర‌చార హంగామా సృష్టిస్తున్నారు.

అయితే కేన్స్ 2025 లో టాలీవుడ్ సంద‌డి అస్స‌లు క‌నిపించ‌డం లేదు. మ‌న స్టార్లు కానీ టెక్నీషియ‌న్లు కానీ కేన్స్ లో సంద‌డి చేస్తున్న‌ట్టు లేదు. ఇలాంటి చోట ఏడాది కాలంగా రూపొందించిన మ‌న సినిమాలేవీ ప్రీమియ‌ర్ల‌కు ప‌నికి రానివా? అనే సందేహం త‌లెత్తింది. అస‌లు తెలుగు చిత్ర‌సీమ నుంచి ప్ర‌ముఖులు ఎవ‌రూ ఈ ఉత్స‌వాల్ని తిల‌కించేందుకు అయినా వెళ్ల‌లేదా? ఇప్ప‌టివ‌ర‌కూ క‌నీసం ఒక సౌత్ స్టార్ ఫోటో కూడా ఇంట‌ర్నెట్ లో క‌నిపించ‌లేదు.

మ‌న‌వాళ్లు ఎవ‌రూ ఎందుకు వెళ్ల‌లేదు? సౌత్ స్టార్ల ప్రాతినిధ్య క‌నిపించ‌లేదేమిటీ? ఈసారి కేన్స్ 2025 సంబ‌రాల్లో బాలీవుడ్ నుంచి 4 సినిమాలు ప్రీమియ‌ర్ వేస్తున్నారు. అందులో జాన్వీ మూవీ కూడా ఉంది. అనుప‌మ్ ఖేర్ లాంటి ఔత్సాహిక ఫిలింమేక‌ర్ త‌న సినిమాని కూడా కేన్స్ లో ప్రీమియ‌ర్ చేసారు. ఐశ్వ‌ర్యారాయ్, ఆలియాభ‌ట్, అతిథీరావు హైద‌రీ, జాన్వీ క‌పూర్ లాంటి కొంద‌రు మాత్ర‌మే కేన్స్ కి ఎటెండ‌వ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. చివ‌రికి కాపీ క్యాట్ సినిమాగా పాపుల‌రైన లాపాటా లేడీస్ న‌టి కూడా కేన్స్ లో సంద‌డి చేసింది.

ఈసారి సౌత్ నుంచి ప్ర‌తిష్ఠాత్మ‌క ఈవెంట్ లో ప్రాతినిధ్యం లేదు. నిజానికి ఆస్కార్ లు, గోల్డెన్ గ్లోబ్ లు, క్రిటిక్స్ అవార్డులు, గ్రామీలు స‌హా ప‌లు ప్రతిష్ఠాత్మ‌క పుర‌స్కారాల కోసం అంద‌రి దృష్టిలో ప‌డాలంటే కేన్స్ వెళ్లాలి. ప్ర‌పంచ దేశాల అవార్డుల కోసం ప్ర‌య‌త్నించే సినిమాల‌కు కేన్స్ వేదిక‌గా బోలెడంత ప్ర‌చారం ద‌క్కుతుంది. కానీ తెలుగు నుంచి క‌నీసం ఒక్క సినిమా కూడా లేదు. మ‌న‌వాళ్లు అస‌లు ఈ ఉత్స‌వాల‌ను ప‌ట్టించుకున్న‌ట్టే లేదు. బాహుబ‌లి లాంటి సినిమాతో రాజ‌మౌళి కేన్స్ లో బోలెడంత ఉత్సాహం పెంచ‌గ‌లిగాడు. కానీ ఈసారి అత‌డు కూడా కేన్స్ లో క‌నిపించ‌లేదు. క‌నీసం తీరిక స‌మ‌యం ఉన్న చాలా మంది టాలీవుడ్ సెల‌బ్రిటీలు కేన్స్ ని ప‌ట్టించుకోక‌పోవ‌డం వివ‌స్మ‌య‌ప‌రుస్తోంది.

Tags:    
  • Cannes2025 
  • Tollywood 
  • SouthCinema 
  • FilmFestival 
  • CannesFilmFestival 
  • TollywoodStars 
  • SouthIndianCinema 
  • FilmFestivals 

Similar News

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS