టాలీవుడ్ హీరోలు.. ఇప్పుడందరికీ ఒకటే స్ట్రాటజీ!

టాలీవుడ్ హీరోల్లో ఇప్పుడు అనేక మంది తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్టుల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.;

Update: 2025-12-04 12:25 GMT

టాలీవుడ్ హీరోల్లో ఇప్పుడు అనేక మంది తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్టుల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఆయా చిత్రాలు ఇంకా సెట్స్ పై ఉండగానే.. కొత్త ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే వర్క్ చేస్తున్న సినిమాలు కంప్లీట్ అవ్వగా.. కొత్త చిత్రాలు మొదలు పెడుతున్నారు.

అయితే ఆ కొత్త సినిమాలు ఫిక్స్ చేయడంలో ఇప్పుడు టాలీవుడ్ హీరోల్లో చాలా మంది ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అదేంటంటే.. ఇప్పటికే తమ హిట్స్ అందించిన దర్శకులకు మళ్లీ ఛాన్స్ ఇస్తున్నారు. వారితో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఏ డైరెక్టర్ ర్ ఆయన హీరోలు వర్క్ చేస్తున్నారు?

ముందుగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకుంటే.. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు మూవీ చేస్తున్న ఆయన.. తన డైరెక్టర్ బాబీతో వర్క్ చేయనున్నారు. ఇప్పటి వారి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వారిద్దరూ జతకట్టారు. త్వరలోనే ఆ సినిమా మొదలుకానుంది.

నందమూరి బాలకృష్ణ మరికొద్ది గంటల్లో అఖండ 2 సీక్వెల్ తో రానుండగా.. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో కొత్త మూవీ మొదలుపెట్టారు. ఇప్పటికే బాలయ్యకు వీర సింహా రెడ్డితో సూపర్ హిట్ ను అందించారు గోపీచంద్. ఇప్పుడు మరోసారి ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ అందుకున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరిగాయి.

మరో సీనియర్ హీరో వెంకటేష్.. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన.. ఆ తర్వాత F2, F3, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో హిట్స్ అందించిన అనిల్ రావిపూడితో వర్క్ చేయనున్నారు. అయితే మన శంకర వర ప్రసాద్ కూడా ఆయనే తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఆ తర్వాత సుకుమార్ తో పనిచేయనున్నారు. ఇప్పటికే వారి కాంబోలో వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో దసరాతో సూపర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ చేస్తున్నారు నాని. టాక్సీవాలాతో విజయం అందించిన రాహుల్ సాంకృత్యాన్ తో విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో మూవీ చేస్తున్నారు.

అలా చాలా మంది హీరోలు ఇప్పుడు తమకు విజయం అందించిన దర్శకులతో పని చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణం కంఫర్ట్ అని పలువురు చెబుతుండగా.. స్ట్రాటజీ అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా తమకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తో మళ్లీ సినిమాలు చేస్తున్న ఆయా హీరోలు.. ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News