కోలీవుడ్ బాట పడుతోన్న తెలుగు హీరోయిన్లు!

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసిన సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల సైతం తెలుగులో వరుస చిత్రాల తర్వాత కాస్త గ్యాప్ రావడంతో కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది.

Update: 2026-05-28 22:30 GMT

ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీ నుండి హీరోయిన్లు టాలీవుడ్‌కు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలుగులో వరుస అవకాశాలు తగ్గినప్పుడో? లేదా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ సక్సెస్ రేటు లేనప్పుడో? నాయికలు పక్కనే ఉన్న అరవ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. చిత్రమైన విషయమేమిటంటే? టాలీవుడ్ సెంటిమెంట్ల కారణంగా పక్కన పెడుతున్న భామలకు కోలీవుడ్ పెద్ద ప్రాజెక్టులతో ఘన స్వాగతం పలుకుతోంది.ఈ సరికొత్త ట్రెండ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ బోర్సే. తెలుగులో గ్రాండ్ డెబ్యూ ఇచ్చినా? బాక్సాఫీస్ సమీకరణాల వల్ల ఇక్కడ ఆశించిన మైలేజ్ దక్కలేదు. అయితే అమ్మ‌డిలో స్క్రీన్ ప్రెజెన్స్, నటనను గుర్తించిన తమిళ మేకర్స్ ఏకంగా స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన క్రేజీ ఆఫర్ ఇచ్చి రెడ్ కార్పెట్ పరిచారు.

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసిన సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల సైతం తెలుగులో వరుస చిత్రాల తర్వాత కాస్త గ్యాప్ రావడంతో కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో ధనుష్ సరసన అమ్మ‌డు నటిస్తున్న కొత్త చిత్రం ఆమె కెరీర్‌కు తమిళంలో గట్టి పునాది వేస్తుందని భావిస్తుంది. ఈ జాబితాలో అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో దూసుకుపోతున్న నటి కృతి శెట్టి .`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న కన్నడ కస్తూరి ఆ తర్వాత తెలుగులో వరుస పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది.

ఇక్కడ అపజయాలు పలకరించగానే టాలీవుడ్ మేకర్స్ ఆమెను దూరం పెట్టారు. కానీ కోలీవుడ్ మాత్రం కృతి శెట్టిని దత్తత తీసుకున్నంత రేంజ్‌లో ఆదరిస్తోంది. అక్కడ వరుసగా క్రేజీ స్టార్ల సరసన భారీ బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటంది. ప్రస్తుతం అక్క‌డ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. వీరితో పాటు గ్లామరస్ బ్యూటీస్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కూడా కెరీర్ సక్సెస్ గ్రాఫ్‌ను పెంచుకోవడానికి తమిళ ఇండస్ట్రీనే ప్రధానంగా నమ్ముకున్నారు. నిధి అగర్వాల్ తెలు గులో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేసినా అనుకున్నంత స్టార్ హోదా దక్కలేదు. దీంతో అమ్మ‌డు తమిళంలో బలమైన పునాది కోసం చూస్తోంది. అటు మాళవిక మోహనన్ సైతం తెలుగులో అగ్ర హీరోల ప్రాజెక్టులలో మెరుస్తూనే, అటు తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడా సాలిడ్ హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉంది.

టాలీవుడ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న హీరోయిన్లకు కోలీవుడ్ ఎందుకు అంతగా రెడ్ కార్పెట్ పరుస్తోందనే అంశాన్ని విశ్లేషిస్తే ఇండస్ట్రీల మైండ్‌సెట్‌లో ఉన్న తేడా స్పష్టమవుతుంది. తెలుగు ఇండస్ట్రీ ఎక్కువగా సెంటిమెంట్, సక్సెస్ రేటు అనే ల్యాబులపై ఆధారపడుతుంది. రెండు ఫ్లాపులు పడగానే హీరోయిన్ ఇమేజ్ తగ్గిపోతుంది. కానీ తమిళ పరిశ్రమ పాత్రల వైవిధ్యానికి, నటనకు, ఫ్రెష్ స్క్రీన్ కాంబినేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. టాలీవుడ్ వదిలేసిన నాయికల గ్లామర్ ..యాక్టింగ్ పొటెన్షియల్‌ను కోలీవుడ్ దర్శకులు తమ సినిమాలకు ప్లస్ పాయింట్‌గా మార్చుకుంటున్నారు.

నటీనటులకు ఒక ఇండస్ట్రీలో నిరాశ ఎదురైనా? పొరుగు పరిశ్రమలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉండటం సౌత్ సినిమా హెల్తీ వాతావరణానికి నిదర్శనం. ఒక భాషలో ప్లాపులు వచ్చాయనో? ఇమేజ్ డల్ అయిందనో ?కెరీర్ ముగిసిపోదు అని ఈ తరం హీరోయిన్లు నిరూపిస్తున్నారు. చెన్నై బాట పట్టిన ఈ టాలీవుడ్ భామలు అక్కడ ఎలాంటి విజయాలు సాధిస్తారో? కోలీవుడ్ ఇచ్చిన లైఫ్-లైన్ ద్వారా ఏ రేంజ్‌లో ఎలా పుంజుకుంటారో చూడాలి.

Tags:    

Similar News