ఈ వారం వచ్చే సినిమాలు ఇవే... ఆ సినిమాల మధ్య తీవ్ర పోటీ

టాలీవుడ్‌లో రెండు వారాల ముందే దసరా పండుగ వాతావరణం నెలకొంది. గాంధీ జయంతి నేషనల్‌ హాలీడే, వీకెండ్‌ ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.

Update: 2026-10-01 07:58 GMT

టాలీవుడ్‌లో రెండు వారాల ముందే దసరా పండుగ వాతావరణం నెలకొంది. గాంధీ జయంతి నేషనల్‌ హాలీడే, వీకెండ్‌ ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. సాధారణంగా శుక్రవారం సెలవు ఉంటే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కావడం మనం చూస్తూ ఉంటాం. శుక్రవారం సెలవు ఉంటే లాంగ్‌ వీకెండ్‌ కలిసి వస్తుందని నిర్మాతలు భావించి తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అలా ఈ శుక్రవారం పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. కొన్ని డైరెక్ట్‌ తెలుగు సినిమాలు కాగా, కొన్ని తెలుగు డబ్బింగ్‌ సినిమాలు ఉన్నాయి. అయితే అన్ని మీడియం రేంజ్‌, చిన్న బడ్జెట్‌ సినిమాలే కావడంతో ఏ సినిమా కంటెంట్‌ బాగుంటే ఆ సినిమా విజేత గా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ మూవీ...

ఈవారంలో విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి రాజమౌళి తనయుడు నిర్మించిన 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' సినిమాపై ఉంది. ఎన్టీఆర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా రావడంతో పాటు, మహేష్‌ బాబు సినిమా గురించి ట్వీట్‌ చేయడం, సినిమా బాగుందని చెప్పడంతో అంచనాలు పెరిగాయి. పైగా సినిమా ట్రైలర్‌కి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. కనుక ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి మంచి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కోర్ట్‌ ఫేం రోషన్‌ హీరోగా నటించిన 'తెల్లకాగితం' సినిమా సైతం రేపు గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతుంది. హీరో రోషన్‌, హీరోయిన్‌ నక్షత్రలు సినిమా ప్రమోషన్‌ కోసం చాలా రోజులుగా కష్టపడుతున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో సినిమాకు బజ్ క్రియేట్‌ అయింది. యూత్‌ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి పెంచుకున్నారు. కనుక డీసెంట్‌ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అనకాపల్లి సినిమాతో...

విక్రమ్ సహిదేవ్ హీరోగా ఖగేష్ తమినేని దర్శకత్వంలో రూపొందిన 'అనకాపల్లి' సినిమా సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తారక్‌ పొప్పన్న, త్రినాధరావు నక్కిన ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్‌ ఆడియన్స్‌ను మెప్పించే ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అనకాపల్లి మూవీ అన్ని వర్గాలను మెప్పిస్తుందని యూనిట్‌ సభ్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది. పైగా థియేటర్లు సైతం ఆశించిన స్థాయిలో లభించినట్లు తెలుస్తోంది. కనుక అనకాపల్లికి మంచి ఓపెనింగ్‌ పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోటీలో ముందు వరుసలో అనకాపల్లి సినిమా నిలిచే విధంగా కంటెంట్‌తో మ్యాజిక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రచన సహకారం అందించడంతో అంచనాలు పెరిగాయి.

కీర్తి సురేష్‌ డోరోతి మూవీ...

ఇంకా రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో సిగ్మా ప్రధానమైన మూవీ. ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్‌ కిషన్ హీరోగా నటించగా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకత్వం వహించాడు. కనుక అక్కడ, ఇక్కడ బజ్‌ క్రియేట్‌ అయింది. అయితే ఎక్కువ థియేటర్లు సిగ్మాకు లభించాయా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా కీర్తి సురేష్ నటించిన డోరోతి సినిమా సైతం రేపు విడుదల కాబోతుంది. ఆ సినిమాతో కీర్తి సురేష్‌ నట విశ్వరూపం చూస్తారని అంటున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించడంతో డోరోతి పై అంచనాలు ఉన్నాయి. ఇక ఆది సాయికుమార్‌ నటించిన 'ఎస్‌ఐ యుగంధర్‌' సైతం రేపు విడుదల కాబోతుంది.

వీటితో పాటు ప్రేమనే ఊరిలో అనే డబ్బింగ్‌ మూవీ సైతం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు బాలీవుడ్‌ మూవీ దృశ్యం చివరి పార్ట్‌ సైతం రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఒకవర్గం తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా వైపు చూస్తున్నారు. మొత్తానికి లెక్కకు మించి విడుదల కాబోతున్న సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు ఏ సినిమాకు మంచి మార్కులు వేస్తారు, ఏ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు రాబడుతాయి, ఏ సినిమాలు ప్రేక్షకుల తిరస్కరణకు గురి అవుతాయి అనేది మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

Tags:    

Similar News