పబ్లిసిటీతో అదరగొట్టేస్తున్నారే
ఓ ప్రాజెక్ట్‌ను సూర్తి చేయడం ఎంత కష్టమో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం కూడా అంతే కష్టం. కాబట్టి సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలోనూ అంతే కేర్ తీసుకుంటున్నారు.;
ఓ ప్రాజెక్ట్‌ను సూర్తి చేయడం ఎంత కష్టమో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం కూడా అంతే కష్టం. కాబట్టి సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలోనూ అంతే కేర్ తీసుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పబ్లిసిటీ డిజైనర్‌లు ప్రత్యేకంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను డైరెక్టరే తీసుకుని అన్నీ తానై నడిపిస్తున్నాడు. సినిమా అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి సినిమా రిలీజ్ వరకు తనదైన మార్కు పబ్లిసిటీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతున్నాడు.
ఈ ఫార్ములాని ఫాలో అవుతున్న దర్శకులలో ముందు వరుసలో నిలుస్తూ అందరికి ఆదర్శంగా మారారు దర్శకుడు రాజమౌళి. బాహుబలికి మించి `RRR`ని ప్రమోట్ చేసి ప్రచార బాధ్యతల్ని,వరల్డ్ వైడ్‌గా పబ్లిసిటీని తన భుజాలకెత్తుకున్న జక్కన్న సినిమాని అనుకున్నట్టుగానే ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లాడు. అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఆస్కార్‌ని ఇండియాకు తీసుకొచ్చి చరిత్ర సృష్టించాడు.
రాజమౌళి అంత కాకపోయినా కొంతలో కొంత వరకు తమదైన ఎఫర్ట్‌తో సినిమాకు సరికొత్త పబ్లిసిటీని కొంత మంది డైరెక్టర్లు చేస్తున్నారు. రాజమౌళి తరువాత సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాలకు ఎత్తుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో తనదైన పబ్లిసిటీ స్ట్రాటజీని మొదలు పెట్టిన అనిల్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా నష్టాల్లో ఉన్న నిర్మాత దిల్ రాజుని గట్టెక్కించాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాని చిరుతో చేస్తున్న సినిమాకు కూడా వాడేస్తున్నాడు.
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో నుంచి ప్రతీ అప్ డేట్‌ని పబ్లిసిటీ యాంగిల్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే అందరిలోనే అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాడు. నయనతార ఎంట్రీకి సంబంధించిన కూడా `రఫ్ఫాడించేద్దాం` అంటూ వీడియోని రిలీజ్ చేసి ఆకట్టుకున్న అనిల్ సినిమా రిలీజ్ వరకు ఇదే తరహా పబ్లిసిటీతో సినిమాకు హైప్‌ని తీసుకురావాలనుకుంటున్నాడట.
ఇదే ఫార్ములాను ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ కూడా ఫాలో అవుతున్నారు. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `తెలుసు కదా`. ఈ మూవీ ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ని సరికొత్త వీడియోతో ప్రకటించి టీమ్ ఆకట్టుకుంది. వీడియో కాల్ లో ఇద్దరు హీరోయిన్‌లతో హీరో ఆడుకుంటున్నట్టుగా క్రియేట్ చేసి ఫన్నీగా సినిమా థీమ్ ని తెలియజేస్తూనే రిలీజ్ డేట్‌ని ప్రకటించడం ఆకట్టుకుంటోంది. ఇదే ఫార్ములాని రానున్న సినిమాల కోసం మరెంత మంది దర్శకులు ఫాలో అవుతారో వేచి చూడాలి.