టాలీవుడ్ లో దంగల్ లాంటి సినిమాలు సాధ్యం కాదా?
తాజాగా పవన్ ఓ సమావేశంలో మరోసారి దంగల్ గురించి చర్చించారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు వచ్చేవని గుర్తుచేశారు.;
భారతీయ చిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ గొప్ప సినిమా ఏది అంటే `దంగల్`. అందులో ఎలాంటి డౌట్ లేదు. వసూళ్ల పరంగానూ రికార్డే..కంటెంట్ పరంగానూ కింగే. ఇండియాలో కంటే చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కుస్తీ నేపథ్యంలో నితిష్ తివారీ తెరకెక్కించిన గొప్ప స్పూర్తిని నింపే చిత్ర మిది. ఈ సినిమా చూసి దేశమే మెచ్చింది. ఈ సినిమాకు వచ్చినన్ని గొప్ప రివ్యూలు ఇంకే సినిమాకు రాలే దు.
అన్ని చిత్ర పరిశ్రమలు `దంగల్` గురించి ఎంతో ఓపెన్ గా తమ అభిప్రాయాన్ని పంచుకున్నాయి. అందు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు అప్పట్లో. తాను నటించిన సినిమాలే పవన్ చూసుకోరు. అలాంటింది అమీర్ ఖాన్ నటించని `దంగల్` ని మాత్ర థియేటర్లో వీక్షించిన అనంతరం తన అభి ప్రాయాన్ని కూడా పంచుకున్నారు. దేశానికి ఇలాంటి సినిమాల అవసరం ఉందని..గొప్ప దేశ భక్తిని చాటే చిత్రమని...యు వతకు ఇలాంటి చిత్రాలు ఆదర్శంగా నిలుస్తాయని..యువత అంతా తప్పక చూడాల్సిన చిత్రంగా పవన్ ప్రత్యేకంగా ప్రమోట్ చేసారు.
తాజాగా పవన్ ఓ సమావేశంలో మరోసారి దంగల్ గురించి చర్చించారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు వచ్చేవని గుర్తుచేశారు. ప్రస్తుతం `దంగల్` లాంటి ప్రభావవంతమైన సినిమాలు రావడం లేదన్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగిన కథలను అందించడంలో వారు వెనుకబడుతున్నారేమో` అని అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి సినిమాలు టాలీవుడ్ ఎందుకు తీయలేకపోతుంది? అన్నది గుర్తించాలి. టాలీవుడ్ కేవలం కమర్శియల్ కోణంలోనే సినిమాలు చేస్తుంది. రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.
అందులోనూ దంగల్ లాంటి స్టోరీ ని వినిపిస్తే నిర్మించడానికిగానీ, నటించడానికి గానీ ముందుకు రారు. అంతెదుకు కుబేర లో ధనుష్ పోపించిన పాత్రను టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో అయినా పోషించే సాహసం చేస్తారా? అంటే చస్తే చేయరు. ఇదే సినిమాలో ఓ కీలక పాత్రకు ముందుగా ఓ పెద్ద స్టార్ హీరోను అనుకు న్నాడు డైరెక్టర్. తీరా వెళ్లి కథ చెబితే ఇలాంటి పాత్రలు తాను చేయనని రిజెక్ట్ చేసారు. ఇలాంటి తిరస్క రణల కారణంగానే గొప్పగా సినిమాలు తీద్దాం అనుకున్న వాళ్లు కూడా ఆదిలోనే ఆగిపోతున్నారని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.