కొంపముంచిన స్పీడ్.. బడా సంస్థకు ఫైనాన్షియల్ దెబ్బ?

అతి తక్కువ కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన ఆ బ్యానర్, స్పీడ్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టింది.;

Update: 2025-11-28 20:30 GMT

సినిమా ఇండస్ట్రీలో పైకి కనిపించే ఆర్భాటం వేరు, లోపల జరిగేది వేరు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక బడా నిర్మాణ సంస్థ పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేసిన ఆ బ్యానర్, ఇప్పుడు ఆర్థికపరమైన చిక్కుల్లో కూరుకుపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతోంది.

అతి తక్కువ కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన ఆ బ్యానర్, స్పీడ్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. ఎంతో మందికి ఉపాధి కల్పించి గొప్ప సంస్థ గా పేరు కూడా తెచ్చుకుంది అయితే ఆ వేగమే ఇప్పుడు వారికి శాపంగా మారిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. చేతిలో పెద్ద సినిమాలు ఉన్నా, బ్యాక్ ఎండ్ లో మాత్రం 'ఫైనాన్షియల్ మెస్' నడుస్తోందని టాక్.

అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. రీసెంట్ టైమ్స్ లో ఈ సంస్థ నుంచి వచ్చిన మీడియం రేంజ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. దీంతో ఆ బ్యానర్ ఊహించని స్థాయిలో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని సమాచారం. కేవలం ఫలితాలే కాదు, సినిమాల క్వాలిటీ విషయంలోనూ ఆడియన్స్ పెదవి విరిచారు. నిర్మాణ విలువలు ఆశించిన స్థాయిలో లేవనే విమర్శలు ఆ బ్యానర్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి.

ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లడం, ఒకదాని ఫలితం మరొక దానిపై పడటం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక పాన్ ఇండియా స్టార్ తో భారీ సినిమా రిలీజ్ కి సిద్ధం చేస్తూనే, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అయితే పాత సినిమాల నష్టాలు, కొత్త సినిమాల బడ్జెట్లు బ్యాలెన్స్ అవ్వక ఆ సంస్థ అధినేతలు తీవ్ర ఒత్తిడిని, కన్ఫ్యూజన్ ను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఆ సంస్థ ముందున్న ఏకైక మార్గం.. చేతిలో ఉన్న పెద్ద సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవ్వడమే. కానీ మార్కెట్ పరిస్థితులు, వడ్డీల భారం చూస్తుంటే అది అంత ఈజీగా కనిపించడం లేదు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లు ఇప్పుడు వారికి పెద్ద సవాలుగా మారాయి. క్వాలిటీ మీద ఫోకస్ పెట్టి, సాలిడ్ హిట్ కొడితే తప్ప ఈ సుడిగుండం నుంచి బయటపడలేరు.

ఏదేమైనా ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, సరైన ప్లానింగ్ కూడా ఉండాలని ఈ పరిస్థితి హెచ్చరిస్తోంది. వేగం తగ్గించి, కంటెంట్ మీద దృష్టి పెడితే ఆ బ్యానర్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. లేదంటే టాలీవుడ్ చరిత్రలో కనుమరుగైన ఎన్నో బ్యానర్ల జాబితాలో ఇది కూడా చేరిపోయే ప్రమాదం ఉంది. మరి ఆ నిర్మాతలు ఈ గండం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి.

Tags:    

Similar News