కాటుక కళ్ళతో కవ్విస్తున్న శ్రీలీల!
కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లను చూస్తూ ఉంటే స్వర్గంలో ఉండే దేవకన్యలు ఇలాగే ఉంటారా అనిపిస్తుంది.;
కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లను చూస్తూ ఉంటే స్వర్గంలో ఉండే దేవకన్యలు ఇలాగే ఉంటారా అనిపిస్తుంది. ఎందుకంటే అంత అందంగా తయారవుతారు.. అచ్చం ఇప్పుడు శ్రీలీలను చూస్తే కూడా అలాంటి ఫీలింగే వస్తోంది. నల్లటి చీరలో శ్రీలీల ఆ బాపు బొమ్మే దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ నల్లటి చీరలో.. కాటుక కళ్ళతో చూపరులను కవ్విస్తోంది. విరబూసిన జుట్టుతో మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకుంది. చాలామంది హీరోయిన్లు సినిమాల్లో అవకాశాల కోసం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం తమ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా శ్రీలీల పోస్ట్ చేసిన ఫోటోలు మాత్రం కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్నాయి.. నల్లటి చీరలో తెల్లటి చందమామలా మెరిసిపోతున్న శ్రీలీల ఫోటోలు చూసి చాలామంది నెటిజన్లలో కవిత్వం పొంగిపోతుంది. శ్రీలీల ఫోటోలకి ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్లు పెడుతున్నారు..
నల్లటి ఆకాశంలో తెల్లటి చందమామ లాగా నల్లటి చీర కట్టుకున్న చందమామ లాంటి శ్రీ లీల ఎంత అందంగా ఉందో అంటూ కవితల లాంటి కామెంట్లతో శ్రీలీల అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.. అలా శ్రీలీల ఈ మధ్యకాలంలో చీరలో ఉన్న ఫొటోస్ ని ఎక్కువ షేర్ చేస్తోంది. రీసెంట్ గానే పెళ్లి చూపులకు రెడీ అయ్యే పెళ్లికూతురు లాగా చీర కట్టుకొని ముద్దుగా ముస్తాబయ్యి ఫొటోస్ షేర్ చేసింది.తాజాగా నల్లటి చీరలో చందమామ లాగా మెరిసిపోతున్న శ్రీలీలను చూసి ఆ అందమే అసూయ పడేలా ఉంది అంటూ ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు..
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్లోకి పెళ్లి సందD మూవీతో వచ్చింది. అయితే సినిమా ఓ మోస్తారు హిట్ అయినప్పటికీ అందులో నటించిన శ్రీ లీల యాక్టింగ్ మాత్రం అందరి హృదయాల్లో పాతుకు పోయింది. అలా ధమాకా సినిమా నుండి తన హవా కొనసాగిస్తోంది . ఇప్పటివరకు శ్రీలీల నటించిన సినిమాల్లో హిట్స్ తక్కువ.. ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకి వరుస ఆఫర్స్ వస్తున్నాయంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో చెప్పుకోనక్కర్లేదు. శ్రీలీల చేతిలో ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు తెలుగు, తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. అలా శ్రీలీల రవితేజతో కలిసిన నటించిన 'మాస్ జాతర' మూవీ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టులోనే విడుదలవ్వాల్సిన ఈ సినిమా అక్టోబర్ 31కి వాయిదా పడింది.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది.అలాగే బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ తో కలిసి మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా జానర్ లో ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో ఇబ్రహీం అలీఖాన్ తో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళంలో సుధా కొంగర డైరెక్షన్లో శివ కార్తికేయన్ నటించబోయే పరాశక్తి మూవీలో కూడా శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అలా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే టైం దొరికినప్పుడల్లా ఇలా ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రకారు మది దోచుకుంటోంది.