మినీ ఫ్రాక్ లో మనసు దోచుకుంటున్న స్నేహ ఉల్లాల్.. ఫోటోలు వైరల్!
అలా ఫైనల్ గా స్నేహ ఉల్లాల్.. సల్మాన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించి 'ఉల్లాసంగా ఉత్సాహంగా' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.;
కొంతమంది హీరోయిన్ల అదృష్టం ఓవర్ నైట్ లోనే దశ తిరుగుతుంది అంటుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు.. మాజీ విశ్వసుందరి, ప్రముఖ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉన్న ఈ హీరోయిన్ బాలీవుడ్ సినిమాలతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా రాణించింది. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆ హీరోయిన్ ఎవరో.. ఆమె ఎవరో కాదు స్నేహ ఉల్లాల్.. ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్న స్నేహా ఉల్లాల్ ని సల్మాన్ ఖాన్..'లక్కీ నో టైమ్ ఫర్ లవ్' అనే సినిమాతో పరిచయం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన చాలామంది గతంలో సల్మాన్ ఖాన్,ఐశ్వర్యరాయ్ మధ్య బ్రేకప్ అయ్యాక.. సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ మీద ఉన్న కోపంతోనే ఆమె లాంటి పోలికలు ఉన్న నటి స్నేహ ఉల్లాల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు అంటుంటారు.
అలా ఫైనల్ గా స్నేహ ఉల్లాల్.. సల్మాన్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించి 'ఉల్లాసంగా ఉత్సాహంగా' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సింహ, మడత కాజా,నేను మీకు తెలుసా వంటి సినిమాల్లో చేసింది. కానీ ఈమె తెలుగులో చేసిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తప్ప.. మిగతా ఏ సినిమాల్లో కూడా ఈ హీరోయిన్ కి గుర్తింపు రాలేదు. అలా చివరికి తెలుగులో కొన్ని సినిమాల్లో రాణించి మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.అలా ఈ ఏడాది స్నేహ ఉల్లాల్ 'సాకో 363' మూవీలో నటించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ హీరోయిన్ తన హాట్ అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. బ్లాక్ కలర్ బికినీ తో పాటు ఎల్లో కలర్ మినీ ఫ్రాక్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవ్వడంతో ఫాలోవర్స్ ఈమె అందానికి మెంటలెక్కిపోతున్నారు. అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా "టేక్ మీ బ్యాక్" అనే క్యాప్షన్ కూడా పెట్టింది.. ఇక స్నేహ ఉల్లాల్ బికినీ లుక్ చూసిన కొంతమంది నెటిజన్స్ అయితే ఈ ముద్దుగుమ్మ మళ్లీ అవకాశాలు అందుకోవాలని.. ఎప్పటిలాగే అభిమానులను అలరించాలి అని కోరుతున్నారు.
మరి ఈ హీరోయిన్ అందాల ఆరబోతతో నైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇక స్నేహ ఉల్లాల్ నుండి నెక్స్ట్ రాబోయే సినిమాల విషయానికి వస్తే.. కన్నడలో ఈ హీరోయిన్ నటించిన దేవి మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు రెడీగా ఉంది. అలాగే స్నేహ ఉల్లాల్ నటిస్తున్న తమిళ మూవీ ఏస్ రాజా రాణి జాకీ మరియు జోకర్ అనే మూవీ 2027 లో విడుదల కాబోతుంది.