పిక్‌టాక్ : ఆఫర్స్ లేక స్కిన్ షో డోస్ పెంచిన టాలీవుడ్ హీరోయిన్?
హీరోయిన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల కారణంగా మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడం మనం చూస్తున్నాం.;
హీరోయిన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల కారణంగా మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడం మనం చూస్తున్నాం. ఆఫర్లు లేని హీరోయిన్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జనాల్లో, సినీ వర్గాల్లో ముఖ్యంగా ఫిల్మ్ మేకర్స్ మధ్య చర్చకు వచ్చే విధంగా హీరోయిన్స్ సోషల్ మీడియా ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కేవలం సోషల్ మీడియా పాపులారిటీ కారణంగా ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారు సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఆఫర్లను సొంతం చేసుకోవడం మనం చూస్తున్నాం.
ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వికి ఛాన్స్ దక్కింది అంటే అది కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడంతో పాటు, వీడియోలను షేర్ చేయడం వల్ల అనడంలో సందేహం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్స్ రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. దాంతో ఈ అమ్మడు ఇప్పటి వరకు సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకోలేక పోయినా కూడా ఆఫర్లు మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత ప్రగ్యా జైస్వాల్ చేతిలో సినిమాలు లేవు. అంటే ఈ ఏడాది తర్వాత ఆమె కొత్తగా నటించేందుకు సినిమాలకు ఇప్పటి వరకు కమిట్ కాలేదు. ఆఫర్లు రాకపోవడంతో ఈమె మెల్ల మెల్లగా సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత డోస్ పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక మోస్తరు స్కిన్ షో తో మెప్పిస్తూ వచ్చిన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు డోస్ పెంచింది. ఇటీవలే తన బికినీ షో చేసిన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు మరోసారి ఫుల్ స్కిన్ షో ఫోటోలను షేర్ చేసింది. తెల్లటి డ్రెస్‌లో దాదాపుగా బికినీ మాదిరిగా ఉన్న ఈ ఔట్ ఫిట్‌లో ప్రగ్యా జైస్వాల్ మరింతగా మెరిసి పోతుంది అంటూ నెట్టింట అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు అభినయం తో మెప్పించింది. కానీ లక్ కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు ఎక్కువగా రాలేదు. అంతే కాకుండా వచ్చిన చిన్నా చితకా ఆఫర్లు హిట్ కాకపోవడం వల్ల స్టార్ హీరోల సరసన ఎక్కువ నటించే అవకాశాలు రాలేదు. బాలకృష్ణకు జోడీగా ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు మూడో సినిమాను చేస్తుంది. మొదటి రెండు సినిమాలు కెరీర్ టర్న్ తిప్పలేక పోయాయి. ప్రస్తుతం చేస్తున్న అఖండ 2 సినిమాతో అయినా ఆఫర్లు దక్కేనా, ఇలాంటి అందాల ఆరబోత స్కిన్ షో ఫోటోలతో అయినా ఈమెకు ఆఫర్లు కొత్తగా వచ్చేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.