అనసూయ స్టన్నింగ్ లుక్‌.. న్యూ గ్లామర్‌తో ఇంకొంచెం ఘాటుగా!

టీవీ స్క్రీన్‌పై యాంకర్‌గా వెలిగిన అనసూయ భరద్వాజ, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తోంది.;

Update: 2025-06-14 06:39 GMT

టీవీ స్క్రీన్‌పై యాంకర్‌గా వెలిగిన అనసూయ భరద్వాజ, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తోంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోషూట్‌ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మెరుస్తున్న డార్క్ గ్రీన్ డ్రెస్‌లో అనసూయ చూపించిన కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు, స్మార్ట్ యాటిట్యూడ్ నెట్టింట్లో నెట్‌జన్లను ఆకట్టుకుంటోంది.


ఈ ఫొటోల్లో అనసూయ వేసుకున్న డ్రెస్, క్లోజ్ షాట్‌లో చూపిన మేకప్, హెయిర్ స్టైల్, హెవీ బాల్ జ్యూవెలరీ.. అన్నీ కలిసి ఆమెను మరింత మోడర్న్ లుక్‌లోకి తీసుకెళ్లాయి. సాఫ్ట్ స్మైల్స్‌తో, కెమెరా వైపు ఆసక్తికరంగా ఇచ్చిన పోజులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫొటోలు లైక్స్‌లో దూసుకుపోతుండగా, ఆమె గ్లామర్ స్టేట్మెంట్‌కి మరోసారి మార్క్ పడింది.


కేవలం యాంకరింగ్‌కి మాత్రమే కాకుండా, నటనలోనూ అనసూయ తనకే సొంతమైన స్థానం సంపాదించుకుంది. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో విలక్షణ పాత్రల్లో మెప్పించిన అనసూయ, ఓటీటీ లోనూ భామాకలపం వంటి ప్రయోగాత్మక ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని వెతుక్కుంటూ వెళ్లే ఈ నటి, తన కెరీర్‌ని విభిన్న దిశలతో విస్తరిస్తోంది.


ప్రస్తుతం ఆమె ‘కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2’ అనే టీవీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. ఈ షో కోసం చేసిన లేటెస్ట్ ఫొటోషూట్‌నే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ "హే యూ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు “ఎవరైతే యంగ్ హీరోయిన్లు ఫ్యాషన్ పోస్ట్‌లు పెడతారో.. అనసూయ వాళ్లకు పోటీగా ఉంది” అని కామెంట్లు పెడుతున్నారు.


అంతేకాదు, అనసూయ గ్లామర్‌కు వయస్సు అనే పరిమితి లేదనేలా తన లేటెస్ట్ లుక్‌తో నిరూపిస్తోంది. ప్రతి ఫొటోకి వేల లైక్స్ వస్తుండటమే కాదు, ఆమె స్టైల్‌ను ఫాలో అయ్యే ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతూనే ఉంది. మొత్తానికి అనసూయ ప్రస్తుతం గ్లామర్ షోతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇక రానున్న రోజుల్లో ఆమె నుంచి ఇంకా ఎలాంటి లుక్స్ బయటకు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News