క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న అదితి..
తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి తాజాగా ELLE బ్యూటీ అవార్డ్స్ -2025 ఈవెంట్ లో బేబీ డాల్ లా మెరిసింది.;
తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి తాజాగా ELLE బ్యూటీ అవార్డ్స్ -2025 ఈవెంట్ లో బేబీ డాల్ లా మెరిసింది. తాజాగా ముంబై జూహులోని జె డబ్ల్యూ మారియట్ SSBeauty Presents ELLE బ్యూటీ అవార్డ్స్ తన 19వ ఎడిషన్ నిర్వహించింది. ఇక ELLE బ్యూటీ ప్రేన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అందుకుంది.. అయితే ఈ అవార్డ్స్ వేడుకలో అదితి రావు హైదరి తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరచింది. బేబీ డాల్ లాంటి డ్రెస్సులో అద్భుతంగా కనిపించింది. గ్లామర్ అందాలు హైలైట్ అయ్యేలా టాప్ తో పాటు ఓ బెలూన్ లాంటి స్కర్ట్ తో స్టైల్ చేసింది.
ఈ డ్రెస్ లో అదితీ రావు హైదరి అచ్చం బేబి డాల్ లాగే కనిపిస్తోంది. ఈ డ్రెస్ కి తగ్గట్టుగానే తన హెయిర్ కట్ కూడా మార్చుకుంది. డ్రెస్ కు తగ్గట్టుగా హెయిర్ కట్ చేయించుకొని తన కళ్ళతో హైలెట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను అదితి రావు హైదరి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకోగా..ఈ ఫోటోలు చూసిన చాలా మంది జనాలు ఇదేంటి అదితి రావు హైదరి లుక్ ని ఇలా చేంజ్ చేసేసింది అని షాక్ అవుతున్నారు. ఈ బేబీ డాల్ లుక్ లో అచ్చం బొమ్మలాగే మెరిసిపోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. అయితే అదితి రావు హైదరీని ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి లుక్ లో చూడలేదు. సడన్గా ఈ ఈవెంట్లో ఫ్యాషన్ ఫార్వర్డ్ దుస్తులలో చూసేసరికి అభిమానులు షాక్ అయిపోతున్నారు.
ప్రస్తుతం అదితి రావు హైదరీకి సంబంధించిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ హీరోయిన్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ కి వస్తే..సత్య దీప్ మిశ్రాని 2002లో పెళ్లాడిన అదితి రావు హైదరి.. పెళ్లైన 10 ఏళ్లకు అంటే 2012లో భర్తకు విడాకులు ఇచ్చేసి మోడలింగ్ రంగంలో రాణించింది.ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లలో రాణించి సౌత్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది.
అలా సౌత్ లో వర్క్ చేస్తున్న సమయంలో మహాసముద్రం సినిమా షూటింగ్ లో నటుడు సిద్ధార్థ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి గత ఏడాది రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి అయిన కొద్ది రోజులకు సిద్ధార్థ్ అదితి రావు హైదరీ లు తమ పెళ్లి విషయాన్నీ బయట పెట్టారు. అలా ప్రస్తుతం పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా దూసుకుపోతుంది అదితి రావు హైదరీ..