సినిమాలో తిరుపతి స్లాంగ్ ఉంటే హిట్ పక్కానా?

ఒకప్పుడు సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరో, మంచి పాటలు, స్ట్రాంగ్ స్టోరీ ఉంటే చాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు వాటితో పాటు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న మరో ఎలిమెంట్ రీజనల్ స్లాంగ్.

Update: 2026-07-12 14:30 GMT

ఒకప్పుడు సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరో, మంచి పాటలు, స్ట్రాంగ్ స్టోరీ ఉంటే చాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు వాటితో పాటు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న మరో ఎలిమెంట్ రీజనల్ స్లాంగ్. ముఖ్యంగా తిరుపతి- చిత్తూరు యాస ఇటీవల కొన్ని సినిమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ స్లాంగ్ కథలో నేచురాలిటీ పెంచడమే కాకుండా, పాత్రలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

రీజనాలిటీకి పెద్దపీట వేస్తున్న తెలుగు సినిమాలు ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్, కల్చర్ ను సిల్వర్ స్క్రీన్ పై నేచురల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో మాట్లాడే రాయలసీమ స్లాంగ్ కొన్ని సినిమాల్లో స్ట్రాంగ్ ఎలిమెంట్ గా మారింది. ఆ యాస వినిపించినప్పుడల్లా ప్రేక్షకులకు ఆ ప్రాంతం గుర్తుకు వచ్చేలా దర్శకులు కథలను రాసుకుంటున్నారు.

ఆ విషయంలో ముందుగా గుర్తుకు వచ్చే సినిమా పుష్ప సిరీస్. శేషాచలం అడవుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో చిత్తూరు యాసను నేచురల్ గా వినిపించారు. పాత్రలు మాట్లాడే ప్రతి డైలాగ్‌ లో ఆ ప్రాంత భాష కనిపించడంతో కథ మరింత ఎఫెక్టివ్ గా అనిపించింది. అందుకే ఆ యాస కూడా సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని చాలా మంది భావిస్తున్నారు. తర్వాత వచ్చిన మా ఇంటి బంగారంలో కూడా ఇదే తరహా ప్రయత్నం కనిపించింది.

సమంత పాత్రలో తిరుపతి యాస వినిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ సీన్స్ లో ఆ యాస మరింత ఎఫెక్ట్ చూపిందనే అభిప్రాయం వ్యక్తమైంది. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆ స్లాంగ్‌ ను ప్రత్యేకంగా హైలైట్ చేయడం ఆసక్తిని పెంచింది. ఇటీవల విడుదలైన లెనిన్ లో కూడా చిత్తూరు యాసకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. విలేజ్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో స్లాంగ్ అందులో కలిసిపోయింది.

సినిమాలో అఖిల్ కూడా ఆ యాసను నేర్చుకుని డైలాగులు చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రమోషన్స్ లో కూడా అదే యాసలో మాట్లాడి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నారు. తిరుపతి యాస స్పెషాలిటీ ఏమిటంటే.. ఇందులో తమిళం, కన్నడ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. మచ్చా, సామి వంటి పదాలతో పాటు చేస్తండాడు, పోతాండాడు, దుడ్డి వంటి పదాలు ప్రత్యేక శైలిని తీసుకొస్తాయి. అయితే కేవలం యాస ఉంటేనే సినిమా హిట్ అవుతుందని చెప్పడం సరైంది కాదు.

మంచి కథ, స్ట్రాంగ్ రోల్స్, ఎమోషన్స్, దర్శకుడి శైలి కూడా అంతే కీలకం. కానీ కథకు తగ్గ రీజనల్ స్లాంగ్ ఉపయోగిస్తే ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి మరింత ఈజీగా వెళ్లగలుగుతున్నారు. అదే సినిమాకు ఎక్స్ ట్రా అసెట్ గా మారుతోంది. ఇప్పుడు వరుసగా పుష్ప, మా ఇంటి బంగారం, లెనిన్ వంటి చిత్రాల్లో తిరుపతి స్లాంగ్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఫ్యూచర్ లో కూడా ఆ యాసను మరిన్ని సినిమాల్లో ఉపయోగించే అవకాశం ఉంది. ఏదేమైనా రీజనల్ లాంగ్వేజ్ ను నేచురల్ గా చూపిస్తే ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తారనే విషయాన్ని ఆ సినిమాలు మరోసారి ప్రూవ్ చేశాయని చెప్పాలి.

Tags:    

Similar News