కీర్తి సురేష్ 'అక్క' ట్రైలర్.. అస్సలు ఊహించిన యాంగిల్!

అయితే కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ లో నటించిన 'అక్క' వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

Update: 2026-10-24 08:36 GMT

ఒకప్పుడు పక్కింటి అమ్మాయిలా కనిపించారు.. 'మహానటి'గా మెప్పించారు.. ఇప్పుడు మాత్రం చేతిలో తుపాకీ పట్టుకొని సవాల్ విసురుతున్నారు. తన మాటే శాసనం కావాలనే లెక్కతో కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అనిపిస్తోంది. ఆమె లీడ్ రోల్ లో నటించిన 'అక్క' వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే కచ్చితంగా అదే ఫీలింగ్ వస్త్తుందని చెప్పాలి.

 

ఇప్పటివరకు చూసిన కీర్తికి, ఇందులో కనిపిస్తున్న అప్పీయరెన్స్ కు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పాలి. అయితే కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ లో నటించిన 'అక్క' వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. యష్‌ రాజ్ ఫిల్మ్స్ కు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేసిన ఆ సిరీస్‌ కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్‌ లో ఇద్దరు మహిళల మధ్య జరిగే పవర్ వార్ ను చూపించారు.

 

వెబ్ సిరీస్ స్టోరీ 1985 నాటి నేపథ్యంలో పెర్నూరు అనే కల్పిత ప్రాంతంలో సాగుతుంది. ఇక్కడ దాదాపు 800 ఏళ్లుగా మహిళలదే డామినేషన్. కుటుంబాలు, వ్యాపారాలు అన్నీ వారి చేతుల్లోనే ఉంటాయి. ఆ వరల్డ్ లో టాప్ ప్లేస్ లో ఉండే మహిళను 'అక్క’'అని పిలుస్తారు. అలాంటి ఏరియాను తన కంట్రోల్ లో ఉంచుకున్న భవాని రోల్ లో కీర్తి కనిపిస్తున్నారు. తన పవర్ కాపాడుకోవడానికి ఆమె ఎంతకైనా సిద్ధపడేలా కనిపిస్తోంది.

 

అయితే భవాని డామినేషన్ కు రుద్ర రూపంలో సవాల్ ఎదురవుతుంది. ఆ రోల్ రాధికా ఆప్టే పోషించారు. భవాని వరల్డ్ ను సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య వార్ మొదలవుతుంది. ఒకరు తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే.. మరొకరు ఆ ప్లేస్ ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తారు. చివరకు వారిద్దరలో ఎవరు పైచేయి సాధిస్తారన్నదే స్టోరీలో మెయిన్ ఎలిమెంట్.

 

సాధారణంగా గ్యాంగ్‌ స్టర్ స్టోరీల్లో జెంట్స్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ 'అక్క'లో మహిళలే గ్యాంగ్స్ నడిపిస్తూ, బిజినెస్ లను కంట్రోల్ చేస్తూ, తమ అధికారాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. ఆ కొత్త వరల్డ్ స్టోరీకి స్పెషాలిటీనే తీసుకొస్తోంది. తుపాకులు, పోరాటాలు, విలన్ల మధ్య వార్స్ తో ట్రైలర్‌ లో యాక్షన్‌ కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. పవర్, ట్రస్ట్, లెగసీ చుట్టూ కథను నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక కీర్తి సురేష్ 'అక్క'లో కనిపిస్తున్న భవాని రోల్ మాత్రం ఆమెకు కొత్త. కేవలం మాటలతోనే కాకుండా, తన చేతలతోనూ డామినేషన్ చూపించే మహిళగా కనిపిస్తున్నారు. తనలోని మరో యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ట్రైల ర్‌లో కనిపించిన ఆ కొత్త అవతార్ సిరీ స్‌పై హైప్ పెంచుతోంది. అయితే, భవాని పాత్రలో కీర్తి ఎంతగా మెప్పిస్తారు.. రుద్రతో వార్ ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుందనేది అక్టోబర్ 30న తేలనుంది.

Full View
Tags:    

Similar News