• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : శ్రీవారి...

వీడియో : శ్రీవారి సన్నిధిలో 'ఖుషి' స్టార్‌

| ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలతో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం

By - Tupaki Desk
Update: 2024-03-04 11:15 GMT

హీరోయిన్‌ సమంత మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలతో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వీడియో లు వైరల్‌ అవుతున్నాయి.

గత ఏడాది కాలంగా సినిమా లకు దూరంగా ఉంటూ, షూటింగ్స్ కు దూరంగా ఉంటున్న సమంత తిరిగి షూటింగ్స్ కు హాజరు అవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొదట ఆమె ఏ సినిమా షూట్‌ లో పాల్గొనబోతుంది అనేది క్లారిటీ లేదు. అయితే షూటింగ్‌ కు ముందు సమంత శ్రీవారిని దర్శించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

స్వామి వారిని దర్శించుకున్న సమయంలో సాంప్రదాయబద్దమైన వస్త్రాల్లో సమంత కనిపించింది. ఆమె లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ మధ్య మయోసైటిస్ కారణంగా మొహం లో కల లేకుండా పోయింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా మారిందని ఈ వీడియో లో చూస్తే అర్థం అవుతోంది.

సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామి వారిని సమంత దర్శించుకుంది. సమంతకు తిరుమల అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. సమంత వెళ్లే సమయంలో మరియు వచ్చే సమయంలో కూడా కెమెరా లు ఆమె చుట్టు ముట్టాయి.

ఆమె తదుపరి సినిమాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించినా కూడా ఆమె నవ్వుకుంటూ వెళ్లింది. ఆమె మీడియాతో మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లి పోయారు. సమంత గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా లో విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన విషయం తెల్సిందే.

#Samantha in Tirumala Tirupati Devasthanam! 🥹♥️🧿#Samantha #SamanthaRuthPrabhu #SamFanClub #TeamSamantha pic.twitter.com/9zI8EkTMio

— 𝐓𝐞𝐚𝐦 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚™ (@TeamSamantha__) March 4, 2024
Tags:    
  • Samantha 
  • Tirumalatirupatidevasthanam 
  • Samantharuthprabhu 
  • Tirupati 
  • Samanthattd 
  • Tollywoodactress 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS