• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టిల్లు స్క్వేర్ రిలీజ్...

టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ - సిద్ధు థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

| టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ పేరు చెబితే చాలు.. అందరికీ టిల్లు క్యారెక్టరే గుర్తుకొస్తుంది

By - Tupaki Desk
Update: 2024-01-26 05:01 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ పేరు చెబితే చాలు.. అందరికీ టిల్లు క్యారెక్టరే గుర్తుకొస్తుంది. ఆ పాత్రలో ఆయన యాక్టింగ్ అంత ఇంపాక్ట్ చూపించింది. డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సిద్ధూ జొన్నలగడ్డ ఫుల్లుగా వినోదాన్ని పంచారు. టిల్లు అంటే సిద్ధు, సిద్ధు అంటేనే టిల్లు అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.


సిద్ధు- అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ షూటింగ్ 2022 ఆగస్టు చివర్లో ప్రారంభమైంది. దీంతో మొదట మార్చి 2023లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ తర్వాత రిలీజ్ డేట్ ను నవంబర్ 2023కు మార్చారు. అయితే షూటింగ్‌ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండటంతో ఈఏడాది ఫిబ్రవరి 9కి రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు. కానీ రవితేజ ఈగల్ సినిమా కారణంగా టిల్లు స్క్వేర్ మరోసారి వాయిదా పడింది.

ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. నో క్యాప్షన్, ఓన్లీ యాక్షన్ అంటూ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో సిద్ధు, అనుపమ యమా స్టైలిష్ లుక్ లో అనుపమను ఎత్తుకొని రొమాంటిక్ మోడ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టిల్లు స్క్వేర్ తో మరోసారి టిల్లు పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ ప్రేక్షకులను అలరించనున్నారు. మొదటి పార్ట్ లో నేహా శెట్టి నటించగా.. ఇప్పుడీ సినిమా కోసం హీరోయిన్ గా మేకర్స్ అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై టిల్లు స్క్వేర్ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టిక్కెట్టే కొనకుండా సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. డీజే టిల్లు సినిమాలోని టిల్లన్న డీజే కొడితే... పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. దానిని రామ్ మిరియాల స్వర పరచడంతో పాటు ఆలపించారు. ఇప్పుడు టిక్కెట్టే కొనకుండా పాటకు కూడా ఆయనే సంగీతం అందించి పాడారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


Tags:    
  • Tillusquare 
  • Siddhujonnalagadda 
  • Anupama 
  • Djtillu2 
  • Tillusquarerelease 
  • Fil 
  • mindustry 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS