• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విక్రమ్ రాథోర్ × టైగర్...

విక్రమ్ రాథోర్ × టైగర్ నాగేశ్వరరావు.. కిక్ ఇవ్వగలడా?

| మొదట దర్శకుడు అవుదామని వచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత సైడ్ హీరోగా కష్టపడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరో గుర్తింపునందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ

By - Tupaki Desk
Update: 2023-10-04 17:30 GMT

మొదట దర్శకుడు అవుదామని వచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత సైడ్ హీరోగా కష్టపడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరో గుర్తింపునందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. హీరోగా మారిన తర్వాత కూడా పలు డిజాస్టర్స్ అయితే ఒక్కసారిగా మార్కెట్ ని డౌన్ చేశాయి. అయితే రవితేజ లో ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు.

ప్రతి సినిమాకు ఒకే తరహాలో హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్లాడు. ఇక డిజాస్టర్ కంటిన్యూ అవుతున్న తరుణంలోనే ఏదో ఒక ప్రయోగంతో సక్సెస్ తో ట్రాక్ లోకి వస్తున్నాడు. అయితే రవితేజ అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.

ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ కూడా అతనే కెరీర్ లో కీలక మలుపు తిప్పే అంశమని చెప్పవచ్చు. స్టువర్ట్ పురం బ్యాక్ డ్రాప్, దొంగల వ్యవహారం, మాఫియా కనెక్షన్లు ఇలా హై వోల్టేజ్ వైబ్రేషన్స్ తెప్పించే అంశాలు ఉన్న కథ కాబట్టి క్లిక్ అవ్వడానికి స్కోప్ ఉంది.

రవితేజ సినిమా కెరియర్ లో టాప్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఏది అంటే అందరికీ ఎక్కువగా గుర్తుకు వచ్చేది మాత్రం విక్రమ్ రాథోర్ సింగ్.

రాజమౌళి దర్శకత్వంలో 2006 లో వచ్చిన విక్రమార్కుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అందులో డబుల్ యాక్షన్ లో కనిపించిన రవితేజ విక్రమ్ రాథోర్ పాత్రలో అయితే సీరియస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. రాజమౌళి సైతం అసలు రవితేజ పాత్రకు న్యాయం చేస్తాడా లేదా అని అనుమానాలతో సినిమా మొదలు పెట్టాడు. కానీ రవితేజ తనలో ఉన్న కసిని మోట్ర్హం బయటపెట్టి జక్కన్నను ఆశ్చర్యపరిచాడు.

ఇక ఇన్నాళ్ళకు మళ్ళీ అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఆకట్టుకునే అవకాశం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రాబోతోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు టీజర్ ట్రైలర్ ద్వారా అయితే ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా చాలా మాసిగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. రవితేజ ఎక్కువగా తన కెరీర్ లో కామెడీ యాంగిల్స్ లో చాలా బాగా ఆకట్టుకున్నాడు.

ఇక అతను సీరియస్ క్యారెక్టర్స్ వస్తే మాత్రం అసలు ఏ మాత్రం నిరాశపరచడు. ఇక ఇప్పుడు టైగర్ క్యారెక్టర్ కూడా అదే ఫ్లోలో క్లిక్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా దసరా సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ట్రైలర్ అయితే అంచనాల స్థాయిని మరింత పెంచేసింది. మరి విక్రమ్ రాథోర్ తరహాలోనే టైగర్ నాగేశ్వరరావు మైమరిపిస్తాడా లేదా అనేది వెండితెరపై చూడాలి.

Tags:    
  • Stuartpuramthief 
  • Directorvamsee 
  • Tigernageswararao 
  • Raviteja 
  • Filmindustry 
  • Tigernageswararaomovie 
  • Nupursanon 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS