బాడీ డబుల్స్ పై ఆధారపడను!
బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టైగర్ ష్రాఫ్ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సక్సెస్‌ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు.;
బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టైగర్ ష్రాఫ్ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సక్సెస్‌ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ తన ఇన్‌స్టాలో ఓ స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి తాను బాడీ డబుల్స్, వీఎఫ్ఎక్స్ పై డిపెండ్ అవనని, స్క్రీన్ పై చేసే ప్రతీ స్టంట్ తాను చాలా కష్టపడి చేసేదేనని చెప్పుకొచ్చారు.
లైఫ్ ను మార్చేసిన వార్
తన సామర్థ్యాలకు కృషి, దేవుని దయే కారణమని చెప్పిన టైగర్ ష్రాఫ్ ఆఖరిగా బాఘి4 అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా అక్టోబర్ 3, 2019లో రిలీజ్ కాగా ఆ సినిమా రిలీజై ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ పోస్ట్ చేస్తూ, ఆ సినిమా తన లైఫ్ ను మార్చేసిందని పేర్కొన్నారు.
సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
వార్2 సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టైగర్ ష్రాఫ్ రెండు వీడియోలను షేర్ చేస్తూ తన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మరియు కో యాక్టర్ హృతిక్ రోషన్ కు కృతజ్ఞతలు చెప్పారు. వార్ మూవీలో టైగర్ ష్రాఫ్ ఖలీద్ గా, సౌరభ్ పాటిల్ గా నటించి మెప్పించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ లో స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన వార్ సినిమాలో రా ఏజెంట్ గా కనిపించారు టైగర్.
అంతేకాదు, రీసెంట్ గా రిలీజైన వార్2 సినిమాలో కెప్టెన్ ఖలీద్ రెహమానీగా టైగర్ గెస్ట్ రోల్ లో కనిపించారు. కాగా టైగర్ ష్రాఫ్ హీరోపంతి అనే యాక్షన్ రొమాంటిక్ మూవీతో యాక్టర్ గా అరంగేట్రం చేయగా, ఆ తర్వాత 2016లో బాఘీ, 2018లో బాఘీ2, 2019లో వార్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని తన యాక్టింగ్ తో మెప్పించారు. మధ్యలో హీరోపంతి2, బడే మియాన్ చోటే మియాన్, బాఘి4 లాంటి భారీ యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి.