త్రిషను ద్రోహిగా ముద్రించిన నెటిజన్లు.. ఎందుకంటే
తనను ద్రోహి అనడం తాను కూడా చూశానని, కానీ తాను ద్రోహిని కాదని, సినిమాలో చాలా పెద్ద షాక్ ఉంటుందని, ఆడియన్స్ అందరూ దానికి రెడీ అవాలని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.;
కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్. మణి రత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన థగ్ లైఫ్ ట్రైలర్ లో అందరినీ ఆశ్చర్య పరిచిన పాత్ర త్రిషది.
సినిమాలో కమల్ తో త్రిష రొమాన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. అయితే త్రిష కమల్ తో రొమాన్స్ చేయడాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. దానికి కారణం లేకపోలేదు. వినైతండి వరువాయ సినిమాలో శింబుతో కలిసి రొమాన్స్ చేసి ఎంతో మంచి కెమిస్ట్రీని పండించిన త్రిష, ఇప్పుడు కమల్, శింబు కలిసి నటిస్తున్న సినిమాలో శింబుతో కాకుండా కమల్ తో రొమాన్స్ చేయడమేంటనేది వారి ప్రశ్న.
ఈ కారణంతోనే త్రిషను ద్రోహి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం త్రిష వరకు వెళ్లగా థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో త్రిష ఈ విషయంపై మాట్లాడింది. తనను ద్రోహి అనడం తాను కూడా చూశానని, కానీ తాను ద్రోహిని కాదని, సినిమాలో చాలా పెద్ద షాక్ ఉంటుందని, ఆడియన్స్ అందరూ దానికి రెడీ అవాలని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
త్రిష చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే థగ్ లైఫ్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ అయితే ఉంటుందని క్లారిటీ వచ్చింది. దాంతో పాటూ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు త్రిష, అభిరామి కమల్ తోనే కనిపించారు తప్పించి శింబుకి జోడీ ఎవరనేది మాత్రం మణిరత్నం ఎక్కడా రివీల్ చేయలేదు. చూస్తుంటే ఈ సినిమాలో ట్విస్టులతో పాటూ షాకింగ్ అంశాలు కూడా చాలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మరి ఆ ట్విస్టులేంటనేది తెలియాలంటే జూన్ 5 వరకు ఆగాల్సిందే.