త్రిష చేసుంటే ఇంకేమవుతుందో? వాళ్లకు లేని ఫీల్ మనకెందుకు?
సీనియర్ బ్యూటీ త్రిష.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ లో నాన్ స్టాప్ గా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు.;
సీనియర్ బ్యూటీ త్రిష.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సెకెండ్ ఇన్నింగ్స్ లో నాన్ స్టాప్ గా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు తన సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ థగ్ లైఫ్ సహా పలు ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాలో కమల్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనున్నారు.
మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్ లైఫ్ ట్రైలర్ ఇటీవల రిలీజైంది. అందులో యాక్షన్ తో క్యాస్టింగ్ అంతా మెప్పించారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటెన్సివ్ డ్రామాతో తండ్రీ కొడుకుల మధ్య వార్ గా సినిమా తెరకెక్కినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ట్రైలర్ లోని కమల్ హాసన్ యాక్ట్ చేసిన రొమాంటిక్ సీన్స్ తో కిస్ సీన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
త్రిష తో కమల్ రొమాంటిక్ సీన్స్.. అభిరామితో అయితే ఏకంగా లిప్ కిస్ సీన్ కోసం ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కమల్, త్రిష, అభిరామి ఏజ్ గ్యాప్ కోసం డిస్కస్ చేసుకుంటున్నారు. కమల్ హాసన్ వయసు 70 ఏళ్లు అయితే, అభిరామి వయసు 41 ఏళ్లు.. త్రిష వయసు 42 ఏళ్లు.. అన్న విషయం అందరికీ తెలిసిందే.
దీంతో ఈ విషయంలో ముద్దు సీన్స్ అవసరమా అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం వాటిని సినిమాలో భాగంగా చూడాలని చెబుతున్నారు. అదే సమయంలో త్రిషతో లిప్ లాక్ సీన్ ఉంటే నెటిజన్లు ఇంకెలా స్పందిస్తారోనని కొందరు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ విషయం పై జోరుగా చర్చ జరుగుతోంది.
నిజానికి.. త్రిష తన కెరీర్ లో లిప్ లాక్ సీన్స్ చేసిన సందర్భాలు తక్కువే. కానీ ఏ హీరోయిన్ అయినా.. తనకు కంఫర్ట్ గా ఉండి పెదవి చుంబన సన్నివేశాల్లో నటించినప్పుడు ఎందుకు అనవసరమైన చర్చ అని కొందరు నెటిజన్లు అంటున్నారు. దాన్ని కథ చెప్పడంలో భాగంగా చూడాలని.. అతిశయోక్తిగా చూడకూడదని చెబుతున్నారు.
ఏదేమైనా ఇప్పుడు థగ్ లైఫ్ ట్రైలర్ సెన్సేషన్ గా మారింది. వేరే లెవెల్ లో రెస్పాన్స్ రాబడుతోంది. యూట్యూబ్ లో ఇప్పటి వరకు 30 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. 1987 తర్వాత మరోసారి మణిరత్నం, కమల్ హాసన్ జతకట్టడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. లిప్ లాక్ సీన్స్ తో మూవీపై అందరి ఫోకస్ పడింది. జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.