థగ్ లైఫ్: ఎక్కడ తేడా కొట్టిందో చెప్పిన మణిరత్నం

మణిరత్నం, కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన థగ్ లైఫ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన విషయం తెలిసిందే.;

Update: 2025-06-23 07:54 GMT

మణిరత్నం, కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన థగ్ లైఫ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. కమర్షియల్ గా చాలా వరకు నష్టాలను మిగిల్చింది. ‘నాయకుడు’ తరహాలో మరో అద్భుతాన్ని ఆశించినవారికి ఈ సినిమా కాస్త నిరుత్సాహాన్ని తెచ్చిపెట్టింది. భారీ అంచనాలతో వచ్చిన సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. కథ, టెక్నికల్ వర్క్ బాగున్నా, సినిమాలోని కథానాయకుని ప్రయాణం ఆకట్టుకోలేకపోయింది.

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించడంతో అభిమానులు మళ్లీ ఓ గొప్ప క్లాసిక్ వస్తుందని భావించారు. అయితే విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోలేక పోయారు. కమల్, మణిరత్నం ఇద్దరూ కలిసొచ్చిన సినిమా ఈ స్థాయిలో డిజాస్టర్ కావడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది.

లేటెస్ట్ గా మణిరత్నం ఈ విషయంపై స్పందిస్తూ, ‘‘మేము నాయకుడి తరహాలో ఓ సినిమా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మళ్లీ అదే తరహా సినిమా ఎందుకు చేయాలి? పూర్తిగా కొత్తగా ప్రయత్నించాం. కానీ ప్రేక్షకులు మమ్మల్ని ఓ స్థాయిలో ఊహించారు. అందులోనే తేడా కొట్టింది. మేము ఇచ్చింది, వాళ్లు ఊహించినది వేరేలా ఉండటం వల్ల ఈ గ్యాప్ ఏర్పడింది’’ అని అన్నారు.

ఇక మణిరత్నం తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టగా, కమల్ హాసన్ మాత్రం బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. థగ్ లైఫ్ ఫలితం కమల్‌ను బాగా కలచివేసిందని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పై ఆయనకు చాలా నమ్మకం ఉంచగా.. రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కొత్త ప్రాజెక్ట్స్‌కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా పరాజయం కమల్ మణిరత్నం కాంబోపై మాత్రమే కాదు, భారీ బడ్జెట్ సినిమాలపై పెట్టుబడులు పెడుతున్న నిర్మాతలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. థగ్ లైఫ్ ఓటీటీ డీల్ రివిజిట్ కావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇకపై సినిమాల నిర్మాణంలో ముందుగా అంచనాలు కాకుండా, కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సినీ పరిశ్రమ అభిప్రాయపడుతోంది.

Tags:    

Similar News