అందుకే ప్రభాస్ మూవీని రిజెక్ట్ చేశా..
తిరువీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సలార్, కింగ్డమ్, సంబరాల ఏటిగట్టు..ఈ మూడు పెద్ద సినిమాల్లో నేను మంచి పాత్రలు వదులుకున్నాను.;
' ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' తో మరోసారి మన ముందుకు రాబోతున్నారు నటుడు తిరువీర్.. విభిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్న హీరోలలో తిరువీర్ కూడా ఒకరు.. అలా జార్జిరెడ్డి, పలాస 1978, పరేషాన్, మసూద వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించిన తిరువీర్ మరికొద్ది గంటల్లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ నవంబర్ 7 న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన వాళ్లు సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరువీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్,కింగ్డమ్ వంటి సినిమాల్లో నేను ఆ పాత్రల్లో చేయాల్సి ఉందని, కానీ రిజెక్ట్ చేసాను అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ తిరువీర్ సలార్,కింగ్డమ్ మూవీలో రిజెక్ట్ చేసిన ఆ రోల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
తిరువీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సలార్, కింగ్డమ్, సంబరాల ఏటిగట్టు..ఈ మూడు పెద్ద సినిమాల్లో నేను మంచి పాత్రలు వదులుకున్నాను. ముఖ్యంగా కింగ్డం మూవీలో రెండు పాత్రలకి ఆఫర్ వచ్చింది. అందులో ఒకటి మురుగన్, రెండోది సింగా..ఈ రెండు పాత్రల్లో గౌతమ్ అన్న నాకు ఛాన్స్ ఇచ్చారు. కింగ్డమ్ లో రాజ్ కుమార్ కసిరెడ్డి పోషించిన సింగా, వెంకటేష్ నటించిన మురుగన్ రోల్స్ లో మొదట నాకే ఛాన్స్ వచ్చింది. కానీ వేరే సినిమాతో ఉన్న ఇష్యూ వల్ల ఈ సినిమాలో నటించలేకపోయాను. ఇక కింగ్డమ్ మూవీ విడుదలయ్యాక మురగన్ పాత్ర చూసి అబ్బా ఎందుకు ఈ పాత్ర మిస్ చేసుకున్నానా అని ఫీల్ అయ్యాను. ఈ పాత్రలో వెంకటేష్ విపి అద్భుతంగా నటించాడు. ఈ పాత్ర వల్ల వెంకటేష్ కి మంచి పేరు వచ్చింది.
అలాగే సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు మూవీలో కూడా ఓ ఛాన్స్ వచ్చింది.ఈ మూవీ డైరెక్టర్ నా ఫ్రెండ్ కావడంతో సినిమాలో ఓ రోల్ ఆఫర్ చేశారు. కానీ ఆ సమయంలో నేను భగవంతుడు అనే మరో సినిమా చేస్తున్నాను. ఆ సినిమాకి కాస్త ఎక్కువ సమయం పట్టింది. అందుకే సంబరాల ఏటిగట్టు మూవీలో ఆఫర్ వదులుకున్నాను.. భగవంతుడు సినిమా వల్ల చాలా ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చింది. అలాగే ప్రభాస్ నటించిన సలార్ మూవీలో కూడా ఓ రోల్ కోసం నన్ను అడిగారు. ఆ సమయంలో టక్ జగదీష్, జార్జిరెడ్డి రిఫరెన్స్ తో నాకు అందులో రోల్ చేసే అవకాశం వచ్చింది. టక్ జగదీష్ చూశాక చాలామంది వాళ్ల సినిమాల్లో ఇలాంటి రోలే కావాలని అడిగారు. అలా సలార్ లో కాటేరమ్మ ఫైట్ లో ఓ రోల్ కోసం తీసుకున్నారు. కానీ నాకే నచ్చక రిజెక్ట్ చేశాను.
టక్ జగదీష్ లో ఉన్నట్టే ఈ సలార్ మూవీలో కూడా చూపించాలి అనుకున్నారు. కానీ అదే రోల్ చేస్తే మళ్లీ అన్నీ అలాంటి పాత్రలే వస్తాయని నేనే వద్దనుకున్నాను. అలాగే సలార్ లో మళ్ళీ అలాగే చూస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టేసి ఇంతకంటే ఇంకేం చేయలేడు అనే ముద్ర పడిపోతుంది. అలా మసూద సినిమా చేశాక అన్ని ఇన్నోసెంట్ పాత్రలే వస్తున్నాయి.కానీ ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ తో మళ్లీ నన్ను నేను నిరూపించుకోవాలి.అలా విలన్ గా చూసిన వాళ్లు మసూద మూవీతో ఇన్నోసెంట్ గా చూశారు. మసూద మూవీ ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఈ సినిమాని ఎంచుకున్నాను.. అలా పెద్ద సినిమాల్లో ఆఫర్ వదులుకున్నాను" అని తిరువీర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.