• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విదేశాల్లో బందీ అయిన...

విదేశాల్లో బందీ అయిన 'స‌లార్' స్టార్

| పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియన్ చిత్రం 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్‌.. ఇత‌ర భాష‌ల టైటిల్) ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైంది.

By - Tupaki Desk
Update: 2024-01-11 04:15 GMT

పృథ్వీరాజ్ సుకుమారన్ .. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఖాన్సార్ సామ్రాజ్యంలో ప‌ట్టాభిషేకం కోసం ఉద్యుక్తుడ‌వుతున్న ఒక రాకుమారుడు. 'స‌లార్' ప్ర‌పంచంలో ఎదురేలేనివాడిగా ఎదిగేందుకు ఓపిక స‌హ‌నంతో వేచి చూసే వీరుడిగా క‌నిపించాడు. స‌లార్ లో పృథ్వీరాజ్ వేష‌ధార‌ణ‌, న‌ట‌న‌కు మంచి పేరు, గుర్తింపు ద‌క్కాయి. స‌లార్ రెండో భాగంలో అత‌డి పాత్ర మ‌రో మ‌లుపు తీసుకోనుంద‌ని మొద‌టి భాగంలో హింట్ ఇచ్చారు. ప్ర‌శాంత్ నీల్ స‌లార్ 2 ని గ్యాప్ లేకుండా వెంట‌నే ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.


ఇంత‌లోనే పృథ్వీరాజ్ సుకుమార‌న్ త‌దుప‌రి ప్ర‌యోగాత్మ‌క చిత్రం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియన్ చిత్రం 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్‌.. ఇత‌ర భాష‌ల టైటిల్) ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైంది. పోస్టర్‌లో పృథ్వీరాజ్ బాగా చిరిగిన బట్టలు.. మాసిన‌ గడ్డం త‌ల‌క‌ట్టుతో క‌నిపిస్తున్నాడు. ఏళ్ల త‌ర‌బ‌డి ఎలాంటి పోష‌ణ‌, సౌక‌ర్యం లేకుండా న‌లిగిపోయిన ఒక బానిస‌లా క‌నిపిస్తున్నాడు. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఆడుజీవితం 10 ఏప్రిల్ 2024న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం క‌థాంశం ఆస‌క్తిక‌రం. పాపుల‌ర్ ర‌చ‌యిత‌ బెన్యామిన్ రచించిన 'ఆడు జీవితం' అదే పేరుతో 2008 మలయాళ నవలకి తెర‌నువాదం ఇది. ఇది 90వ దశకం ప్రారంభంలో కేరళలోని పచ్చటి తీరం నుండి విదేశాలలో అదృష్టాన్ని వెతుక్కుంటూ వలస వచ్చిన నజీబ్ అనే యువకుడి నిజజీవిత కథతో రూపొందింది.

పృథ్వీరాజ్‌తో పాటు, ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్-లూయిస్, అమలా పాల్, K.R.గోకుల్ , ప్రఖ్యాత అరబ్ నటులు తాలిబ్ అల్ బలూషి, రికాబీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది గోట్ లైఫ్ కి ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా, సౌండ్ డిజైన్‌ను ర‌సూల్ పూక్కుట్టి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: సునీల్ కెఎస్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.

The tale of hope & survival waiting to be told!
Experience the ultimate adventure on 10.04.2024.@DirectorBlessy @arrahman @benyamin_bh @prithviofficial @Amala_ams @Haitianhero @rikaby @resulp#TheGoatLifeFilm #TheGoatLifeMovie #Aadujeevitham #Blessy #Benyamin… pic.twitter.com/yHwLbhTvdC

— Prithviraj Sukumaran (@PrithviOfficial) January 10, 2024
Tags:    
  • Malayalam 
  • Actor 
  • Prithvirajsukumarn 
  • Thegoatlife 
  • Poster 
  • Releasedate 
  • Panindiamovie 
  • Arrahman 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS