గుబులు పట్టించే రొమాన్స్ అందుకే అంత పెద్ద హిట్టు
చివరి భాగం ఫీచర్ ఫిలింగా మారుతోంది. ఇందులో బెల్లే ప్రయాణంలో చివరి అధ్యాయాన్ని తెరపై చూపించబోతున్నారు.;
యుక్త వయసులో ప్రేమ, కుటుంబంతో అనుబంధం, కెరీర్ సవాళ్లు, ఇంకా లైఫ్ లో చాలా ఉంటాయి. ప్రతి దశలోను సంక్లిష్ఠతలు, ఆనందాలు, భావోద్వేగాలు బయటపడుతూనే ఉంటాయి. అలాంటి వాటిని తెరపై హృద్యంగా చూపిస్తే అదంతా వీక్షకులకు ఎంతో మజానిస్తుంది. అలాంటి మజా ఉంది గనుకనే జెన్నీ హాన్ హిట్ సిరీస్ `ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ` మూడు సీజన్లుగా రక్తి కట్టిస్తోంది. ఇప్పుడు ఇదే కథను పెద్ద తెరపై చూపించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. చివరి భాగం ఫీచర్ ఫిలింగా మారుతోంది. ఇందులో బెల్లే ప్రయాణంలో చివరి అధ్యాయాన్ని తెరపై చూపించబోతున్నారు.
2022లో ఈ సిరీస్ మొదలైంది. ప్రైమ్ వీడియోలో గొప్ప ఆదరణ దక్కించుకుని, ప్రారంభ వారాంతంలో ప్రైమ్ వీడియో రేటింగ్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. రెండవ సీజన్ 2023లో స్ట్రీమ్ అయింది. సీజన్ 1 వీక్షకుల సంఖ్యను కేవలం మూడు రోజుల్లోనే అధిగమించింది. సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో ది బెస్ట్ గా నిలిచింది. తొలి వారంలోనే 2.5 కోట్ల మంది వీక్షించారంటే దీనికి ఎంతటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద తెరపై నాలుగో భాగం విడుదలవుతుంది.
బెల్లె లైవ్ లైఫ్, తను ఎదుర్కొనే సవాళ్లను ఇప్పుడు నాలుగో భాగంలో చూపించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సిరీస్‌లు భారతదేశంలో ఇతర ఓటీటీల కంటెంట్ ని కూడా ప్రభావితం చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. ముఖ్యంగా లవ్ లైఫ్, రొమన్స్ జానర్ లో సినిమాలను ఆదరించే భారతదేశానికి ఇది యాప్ట్ కంటెంట్ గనుక ఈ సిరీస్ ఇక్కడ కూడా గొప్ప ఆదరణ దక్కించుకుంది. ఇక వెబ్ సిరీస్ తో ఫాలోయింగ్ పెరిగింది గనుక, పెద్దతెరపై సినిమాను రిలీజ్ చేయడం ద్వారా భారీ కలెక్షన్లను కొల్లగొట్టాలనే వ్యూహాన్ని నిర్మాతలు అనుసరిస్తున్నారని భావించాలి. జెన్ జెడ్ రొమాంటిక్ డ్రామాలను రక్తి కట్టించేలా యువతరం కుర్చీ అంచుకు జారేలా తెరకెక్కించడంలో సుప్రసిద్ధుడు అయిన జెన్నీ హాన్ నాలుగో భాగం (పెద్ద తెర వెర్షన్)లో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.