• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రానా అమెజాన్ షో.. ఈసారి...

రానా అమెజాన్ షో.. ఈసారి మరింత కొత్తగా..

| నవంబర్ 23 నుండి 'ది రానా దగ్గుబాటి షో' ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ షో రానా స్పిరిట్ మీడియా బ్యానర్‌పై నిర్మితమైంది.

By - Tupaki Desk
Update: 2024-11-13 10:54 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ స్టార్స్ లో ఒకరైన రానా అందరూ నడిచే దారిలో నడవడం లేదు. హీరోగా కొంత మార్కెట్ ఉన్నా కూడా ఏది పడితే అది చేయకుండా మనసుకు నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇక హోస్ట్ గా కూడా ఇప్పటికే అనేక షోలలో ఈవెంట్స్ లో సత్తా చాటాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో రానా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. అలాగే నెంబర్ వన్ యారీ అంటూ అప్పట్లో ఒక షో చేశాడు.

 

అయితే మళ్ళీ చాలా కాలం తరువాత రానా ఒక స్పెషల్ సెలబ్రేటీ షో ద్వారా హడావుడి చేయబోతున్నాడు. తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం ప్రైమ్ వీడియో నుండి మరొక ప్రత్యేకమైన షో రాబోతోంది. నవంబర్ 23 నుండి 'ది రానా దగ్గుబాటి షో' ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ షో రానా స్పిరిట్ మీడియా బ్యానర్‌పై నిర్మితమైంది. ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్‌లో టాలీవుడ్ ప్రముఖులు తన జీవితంలో వ్యక్తిగత క్షణాలను పంచుకోనున్నారు.

దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి టాప్ సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటారు. సాధారణంగా టాక్ షోల్లో కనిపించే కార్యక్రమాలకు భిన్నంగా, ఈ షోలో నిజ జీవిత కథలు, ఆసక్తికరమైన ఆటలు, మనసుకు హత్తుకునే సంభాషణలు ఉంటాయని తెలుస్తోంది. రానా దగ్గుబాటి మిత్రులతో సరదాగా గడుపుతూ వారి జీవితంలోని ఇతర కోణాలను మన ముందుకు తీసుకురానున్నాడు.

ప్రతి శనివారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతుందని, ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో అందుబాటులో ఉంటుందని ప్రైమ్ వీడియో ప్రకటించింది. ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ అధిపతి నిఖిల్ మధోక్ మాట్లాడుతూ, "రానా సహజమైన చమత్కారంతో, నిజాయతీతో పర్సనల్ టచ్ ఇవ్వగలడని, ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది" అని పేర్కొన్నారు.

ఇక రానా మాట్లాడుతూ, నిజమైన అనుబంధాల గురించి మిత్రులతో సరదాగా నవ్వుతూ, కొత్త అనుభవాలను పంచుకోవడమే ఈ షో ప్రత్యేకత. ప్రియమైన ప్రేక్షకులు ఈ షోలోని అనూహ్యమైన, సరదా క్షణాలను ఆస్వాదించాలి" అని కోరుకుంటున్నాను అని రానా తెలిపారు. టాక్ షోలపై కొత్త కోణంతో రానా దగ్గుబాటి రూపొందించిన ఈ షో, టాలీవుడ్ స్టార్ల జీవితాలను డిఫరెంట్ గా చూపించనుందని అర్ధమవుతుంది.

Tags:    
  • Dulquersalmaan 
  • Nagachaitanya 
  • Siddhujonnalagadda 
  • Sreeleela 
  • Ranadaggubatishow 
  • Ranadaggubati 
  • Rana 
  • Nikhilmadhok 
  • Amazonprime 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS