'ది ప్యారడైజ్'.. గట్టిగా ప్లాన్ చేశారు, కానీ...

అయితే ఈ పుకార్లన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టేలా మేకర్స్ ఒక భారీ స్కెచ్ వేసినట్లు ఇన్ సైడ్ టాక్. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నది.. ఒకేసారి సౌండ్ చేయడానికి అని తెలుస్తోంది.;

Update: 2025-11-25 00:30 GMT

'దసరా'తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన నాచురల్ స్టార్ నాని, ఇప్పుడు అంతకు మించిన బడ్జెట్ తో 'ది ప్యారడైజ్' చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ పై ఎంత హైప్ ఉందో.. అంతకంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తోంది. అసలు ఈ సినిమా షూటింగ్ సజావుగా జరుగుతోందా? లేక ఏమైనా అవాంతరాలు ఎదురయ్యాయా? అనే సందేహాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల పుకార్లే. షూటింగ్ కు బ్రేకులు పడ్డాయని, డైరెక్టర్ కు నిర్మాతకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే వర్క్ స్లో అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నటుడు మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చినా, షూటింగ్ స్పీడ్ మాత్రం ఆశించినంతగా లేదనే టాక్ బలంగా ఉంది. ఈ సైలెన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.

మరోవైపు రిలీజ్ డేట్ ఏమో దగ్గరపడుతోంది. వచ్చే ఏడాది మార్చి 26న కచ్చితంగా రిలీజ్ చేస్తామని టీమ్ చెబుతూనే ఉంది. కానీ పోటీలో ఉన్న రామ్ చరణ్ 'పెద్ది' ఇప్పటికే పాటలతో రచ్చ మొదలుపెట్టేసింది. 'ప్యారడైజ్' నుంచి మాత్రం ఒక్క జైలు గ్లింప్స్ తప్ప, చెప్పుకోదగ్గ విజువల్ కంటెంట్ ఏదీ రాలేదు. దీంతో అసలు అనుకున్న టైమ్ కి సినిమా వస్తుందా అనే డౌట్ అందరిలో మొదలైంది.

అయితే ఈ పుకార్లన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టేలా మేకర్స్ ఒక భారీ స్కెచ్ వేసినట్లు ఇన్ సైడ్ టాక్. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నది.. ఒకేసారి సౌండ్ చేయడానికి అని తెలుస్తోంది. ఫస్ట్ సింగిల్ లేదా టీజర్ కోసం ఒక నెవ్వర్ బిఫోర్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. లోకల్ గా కాకుండా.. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి ఒక గ్లోబల్ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు బోగట్టా.

ఈ ప్లాన్ వర్కవుట్ అవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చేతుల్లోనే మ్యాజిక్ ఉంది. ప్రస్తుతం అనిరుధ్ చేతినిండా ప్రాజెక్టులు, మలేషియా కాన్సర్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్వయంగా చెన్నై వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నారట. పోటీ గట్టిగా ఉంది కాబట్టి, 'చికిరి చికిరి'ని మించేలా ఒక సాలిడ్ సాంగ్ పడితే గానీ ఈ నెగటివ్ బజ్ పోదు.

మొత్తానికి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడాలంటే 'ప్యారడైజ్' నుంచి ఒక సాలిడ్ అప్డేట్ రావాల్సిందే. నాని గ్లోబల్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే, కేవలం డేట్స్ అనౌన్స్ చేస్తే సరిపోదు.. కంటెంట్ తో కొట్టాలి. అప్పటివరకు ఈ గాసిప్స్ ఆగవు మరి. చూడాలి, నాని టీమ్ ఈ సైలెన్స్ ను ఎప్పుడు బ్రేక్ చేస్తుందో.

Tags:    

Similar News