ఆర్కె సాగర్ 'ది 100' ట్రైలర్ టాక్..!

ఇక ఈ సినిమా ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం వల్ల ట్రైలర్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది.;

Update: 2025-07-05 16:19 GMT

బుల్లితెర మీద నటించిన వారిలో చాలా తక్కువ మందికి హీరో ఇమేజ్ వస్తుంది. సీరియల్ లో తాము చేసిన పాత్రల వల్ల ఏర్పడ్డ క్రేజ్ తో కొందరు సిల్వర్ స్క్రీన్ పై కూడా ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారిలో ఆర్కె సాగర్ కూడా ఒకరు. నటుడిగా బుల్లితెర ప్రేక్షకుల ఆమోదం పొందిన అతను సిల్వర్ స్క్రీన్ పై ప్రేక్షకుల మెప్పు పొందాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో అతను చేస్తున్న ప్రయత్నమే ది 100 మూవీ.

ఆర్కె సాగర్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాను రాఘవ్ ఓంకార్ శశిధర్ డైరెక్ట్ చేశారు. సినిమాలో మిష నారంగ్, ధన్య బాలకృష్ణ. ఆనంద్, కళ్యాణ్ నటరాజన్ వంటి వారు ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. క్రియా ఫిల్మ్ కార్ప్ బ్యానర్ లో రమేష్ కరుకూరి, వెంకీ పుషాడపు, జె తారక్ రాం ఈ మూవీ నిర్మించారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయడం వల్ల ట్రైలర్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో తుపాకి వాడకుండానే తన పనితనం చూపిస్తాడు. కానీ తను తుపాకి వాడితే కానీ సాల్వ్ చేయలేని సమస్య వస్తే ఏం చేశాడు అన్నది ది 100 కథ.

ట్రైలర్ లో కథ మెయిన్ ఫ్లాట్ రివీల్ చేయకపోయినా ఆర్కె సాగర్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ స్టఫ్ ఉందని అర్ధమవుతుంది. ట్రైలర్ కట్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సినిమాకు శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. కెమెరా వర్క్, మ్యూజిక్ ఈ రెండు కూడా సినిమా మీద మంచి ఇంపాక్ట్ కలిగేలా చేశాయి.

ది 100 ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. యాక్షన్ సినిమాలు, పవర్ ఫుల్ పోలీస్ స్టోరీస్ చూసే ఆడియన్స్ కు ఇది ఒక మంచి స్టఫ్ అందిస్తుంది. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఎలాగు ట్రైలర్ రిలీజ్ చేసింది పవర్ స్టార్ కాబట్టి ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు సపోర్ట్ అందించే ఛాన్స్ ఉంటుంది.

Full View
Tags:    

Similar News