స్పిరిట్ : ఈ రెండు ఫోటోలతో పుకార్లు షురూ
కొరియన్ నటుడు డాన్ లీ తో తరుణ్, శ్రీకాంత్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.;

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందబోతున్న 'స్పిరిట్' సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలను తీసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటికే స్పిరిట్ సినిమా కథ రెడీ అయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ తుది దశకు చేరుకున్నట్లు స్వయంగా దర్శకుడు సందీప్ వంగ ప్రకటించాడు. సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఆ విషయాన్ని దర్శకుడు సందీప్ వంగ ప్రకటించాడు. ఇక సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

స్పిరిట్ సినిమాను ప్రకటించి మూడు ఏళ్లు దాటింది, ఈ సినిమాను ప్రకటించిన తర్వాత యానిమల్ సినిమాను చేసిన దర్శకుడు సందీప్ వంగ, ఆ సినిమా వచ్చి కూడా ఏడాదిన్నర దాటింది. అయినా కూడా స్పిరిట్ సినిమాను మొదలు పెట్టలేదు. కానీ సినిమాలో ముఖ్య పాత్రలో కొరియన్ నటుడు డాన్ లీ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా స్పిరిట్‌లో హీరోయిన్‌గా దీపికా పదుకునేను ఎంపిక చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో తృప్తి డిమ్రిని ఫైనల్ చేయడం జరిగింది. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో ప్రధానంగా తరుణ్, శ్రీకాంత్‌లు స్పిరిట్ సినిమాలో కనిపించబోతున్నారు అనేవి ప్రధానమైన పుకార్లు.
కొరియన్ నటుడు డాన్ లీ తో తరుణ్, శ్రీకాంత్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఇప్పటి వరకు డాన్ లీ తెలుగులో నటిస్తున్న విషయం కన్ఫర్మ్ కాలేదు. అయినా కూడా ఆయనతో తరుణ్, శ్రీకాంత్‌లు ఫోటోలు దిగడంతో ఆయనతో పాటు, వీరిద్దరూ 'స్పిరిట్' సినిమాలో కనిపించబోతున్నారు అనే ప్రచారం మొదలైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగకి తరుణ్ తో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇద్దరూ ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. ఇద్దరూ రెగ్యులర్‌గా కలుస్తూ ఉంటారు, ఇద్దరికి మధ్య సినిమాకు సంబంధించిన చర్చలు జరగడం కామన్‌గా జరుగుతుందని వారి కామన్ మిత్రులు చెబుతూ ఉంటారు. అందుకే స్పిరిట్ సినిమాతో తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఫ్యామిలీ హీరోగా సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగిన శ్రీకాంత్ ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోగా ప్రభాస్ నటిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్లో స్పిరిట్ సినిమాకు బజ్ క్రియేట్ అయింది. ఇలాంటి సమయంలో డాన్ లీ తో వీరు ఫోటోలు దిగడంతో జాతీయ మీడియాలోనూ ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది. డాన్‌లీ తో వీరిద్దరి ఫోటోల వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ ముగ్గురు స్పిరిట్ సినిమాలో ఉంటే ఖచ్చితంగా రచ్చ మామూలుగా ఉండదు అని కొందరు సోషల్ మీడియాలో విశ్లేషిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ రెండు ఫోటోలతో పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నారు. ఈ పుకార్లపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పందించేనా చూడాలి.