ప్రభాస్ 'రాజా సాబ్'.. తమన్ ఎలివేషన్ మామూలుగా లేదు!

ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెట్టిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.;

Update: 2026-01-05 06:22 GMT

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఆ హై బడ్జెట్ హారర్ ఫాంటసీ మూవీ.. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.

ప్రభాస్ ఫ్యాన్స్‌ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా అలరించేలా సినిమా ఉంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు మూవీపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ప్రమోషన్ల విషయంలో మేకర్స్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ మరికొన్ని గంటల్లో ఫైనల్ సాంగ్ ను విడుదల చేయనుండగా.. ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెట్టిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. క్లైమాక్స్, ఐమ్యాక్స్, మారుతి మ్యాక్స్ అంటూ తమన్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు. సినిమాపై ఓ రేంజ్ లో ఆయన ఎలివేషన్స్ ఇచ్చారని చెప్పాలి.

తమన్ పోస్ట్ ద్వారా సినిమా క్లైమాక్స్ చాలా పవర్‌ ఫుల్‌ గా ఉండబోతోందని క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్లలో ఆ క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్ మరో లెవెల్‌ లో ఉంటుందని అర్థమవుతోంది. రాజా సాబ్ తో దర్శకుడు మారుతి తన స్టైల్‌ లో కంప్లీట్ రేంజ్ లో విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారనే తమన్ పోస్ట్ తో అనిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. రాజా సాబ్ లో ప్రభాస్ నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించనున్నారు. హారర్, ఫాంటసీ, కామెడీ అంశాలతో రూపొందిన సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సినిమాలో కీలక పాత్రలో సందడి చేయనున్నారు.

ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ, కమెడియన్ సప్తగిరి కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. స్వరాలు సమకూర్చుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్‌ తో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న మూవీ.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఆ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డార్లింగ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవనుందని అంతా అంచనా వేస్తున్నారు. మరి మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో.. ఎంతలా అందరినీ మెప్పిస్తుందో వేచి చూడాలి.



Tags:    

Similar News