మైక్ పట్టి మాట్లాడితే అయిపోతుందా? అలా ఎలా అంటారు?: తమన్

ఇప్పుడు ఆ విషయంపై తమన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మేకర్స్.. రీసెంట్ గా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించగా.. అందులో తమన్ పాల్గొన్నారు.;

Update: 2025-12-15 05:02 GMT

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. రీసెంట్ గా అఖండ 2: తాండవం మూవీకి వర్క్ చేసిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా.. డిసెంబర్ 12వ తేదీన విడుదలైంది. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన ఆ మూవీ.. అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది.

ఇప్పుడు ఆ విషయంపై తమన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మేకర్స్.. రీసెంట్ గా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించగా.. అందులో తమన్ పాల్గొన్నారు. ఆ సమయంలో అఖండ-2 మూవీకి ఎదురైన ఆటంకంతోపాటు జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేయగా.. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

"అఖండ-2 వారం ఆలస్యంగా విడుదలైంది. వాళ్ళు అనుకుని ఉంటే ముందు కేసు వేయవచ్చు. లేకుంటే ఎప్పుడో ఆపి ఉండవచ్చు.కానీ, చివరి నిమిషంలో వచ్చి ఆపారు. దీని బట్టి తెలుస్తుంది ఏంటంటే.. మన మధ్య యూనిటీ లేదు. మనం అని అంతా స్ట్రాంగ్ గా లేరు. అందరూ అంతే. మాదే.. నాదే.. మేమే అంటున్నారు" అని తమన్ అన్నారు.

"అందరూ కలిసుంటే ముందుకెళ్తాం. మనం అనుకుంటే ఎదుగుతాం. చాలా మంది వివిధ స్టూడియోలకు వెళ్లి సలహాలు ఇచ్చారు. అదేదో ప్రొడక్షన్ హౌస్‌ కు వచ్చి ఇస్తే నిర్మాతలకు ఇంకా బలం వచ్చేది. ఎవరిని అడిగినా నిర్మాతలు మంచి వాళ్ళు అని చెబుతున్నారు. అలాంటప్పుడు తప్పుగా ఎందుకు మట్లాడాలి?" అని అడిగారు.

"అందరూ వచ్చి కూర్చుని మాట్లాడితే సమస్య క్లియర్ అవుతుంది. కానీ ఛానల్ మైక్ దొరికితే మాట్లాడడం తప్పు కదా. ఇండస్ట్రీలో ఐక్యత లేదు. అందరూ కలిసి ఉండే సమయం వచ్చింది. అందరూ కష్టపడితే సినిమా వస్తుంది. నాలుగు గోడల మధ్య జరగాల్సింది.. అందరికీ బ్యాడ్ గా కన్వే అయింది" అని తమన్ అభిప్రాయపడ్డారు.

"టాలీవుడ్ గొప్ప ఇండస్ట్రీ. బయట ఎంతో పేరు ఉంది. ఇంత మంది హీరోలు, ఈ స్థాయి అభిమానులు ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లో ఎక్కడా లేరు. అందుకే తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలింది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నెగెటివిటీ పెరిగిపోయింది" అని తెలిపారు.

"అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండ్‌ ఎయిడ్‌ వేయండి. దాని గురించి బయటకు వెళ్లి బ్యాండ్‌ వేయకండి. చాలా తప్పు అది. చివరి నిమిషంలో నిర్మాతలు ఎందుకు ఆపుతారు? ఆ సమయంలో ఎంత కుమిలిపోయి ఉంటారు? వాళ్లకు కూడా ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు. ఆలోచించకుండా అనేశారు" అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశారు.



Tags:    

Similar News