రామ్ జో 'గారు' అన్నాడంటే కక్ష కట్టినట్టే.. తమన్ ఎమోషనల్..
వెంకటేష్‌తో సినిమా చేయడం అనేది తనొక కలగా భావించానని..వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రావాలని తాను గత పదేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ మానిఫెస్ట్ చేసినట్లు తెలిపారు.
విక్టరీ వెంకటేష్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం`ఆదర్శ కుటుంబం`. తాజాగా నారాయణమ్మ అంటూ సాగే పాటను విడుదల చేసారు. ఈ వేడుకలో చిత్రయూనిట్ పాల్గొంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ వేడుకలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెంకటేష్‌తో సినిమా చేయడం అనేది తనొక కలగా భావించానని..వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రావాలని తాను గత పదేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ మానిఫెస్ట్ చేసినట్లు తెలిపారు.
వెంకటేష్‌లోని చిన్నపిల్లాడి లాంటి మనస్తత్వాన్ని... అందరినీ ప్రోత్సహించే విధానాన్ని తమన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెంకటేష్‌తో కలిసి క్రికెట్ గ్రౌండ్‌లో గడిపే క్షణాలు ఎప్పుడూ చాలా సరదాగా ఉంటాయని తెలిపారు. చిత్ర యూనిట్ అంతా ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తున్నామని.. సెట్స్‌లో అందరితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.
తాజాగా విడుదలైన `నారాయణమ్మ` పాట కేవలం ప్రారంభం మాత్రమేనని.. ఈ చిత్రంలో ఇంకా అనేక అద్భుతమైన పాటలతో పాటు మరో సాంగ్ కూడా రానుందని తమన్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఒక అద్భుతమైన మ్యూజికల్ ఆల్బమ్‌ను అందిస్తానని ఈ వేదికగా మాటిచ్చారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (బీజీఎం) పనులు ఒక వారం క్రితమే ప్రారంభించామని.. ఆ స్కోరింగ్ చేయడాన్ని తాను పూర్తిగా ఆస్వాధిస్తున్నానని చెప్పారు.
త్రివిక్రమ్‌తో తన ప్రయాణం గురించి చెబుతూ.. అతడితో అనుబంధం కలిగి ఉండటం తన జీవితంలో ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తమన్ తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు చినబాబు -నాగవంశీ కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకటేష్ -త్రివిక్రమ్ ఉన్నారంటేనే సెట్స్‌లో ఎంతో సరదాగా ఉంటుందని.. ఈ సినిమా కోసం తామంతా ఎంతో ఆనందంగా పని చేస్తున్నామని అన్నారు.
అక్టోబర్ 9న సినిమా విడుదలకు ముందుగా ఒక గొప్ప మ్యూజికల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుందని తమన్ వెల్లడించారు. రిలీజ్ కి రెడీ అవుతున్న `ఆదర్శ కుటుంబం` సినిమాను థియేటర్లలో చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని చెబుతూ.. అందరూ థియేటర్లలో కలుద్దామని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.