• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'స్త్రీ 2' మేకర్స్‌తో...

'స్త్రీ 2' మేకర్స్‌తో రష్మిక హారర్ కామెడీ.. హీరో ఎవరంటే?

| ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ను ప్రకటించింది.

By - Tupaki Desk
Update: 2024-10-30 07:28 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. తెలుగుతో పాటుగా కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. గతేడాది చివర్లో 'యానిమల్' మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రష్మిక.. ఈ ఏడాది చివర్లో 'పుష్ప 2'తో పాన్ ఇండియాని పలకరించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ను ప్రకటించింది.

రష్మిక మందన్న బాలీవుడ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి ఓ హిందీ సినిమాలో నటించనున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని అఫీషియల్ అనౌన్స్ చేసారు. డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకి 'థామ' అనే ఆసక్తికరమైన టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక అనౌన్స్ మెంట్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'థామ' అనేది హార్రర్ కామెడీ మూవీ. ‘స్త్రీ 2’, ‘భేడియా’, ‘ముంజ్యా’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను రూపొందిన దినేష్ విజన్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘దినేష్ విజన్ హార్రర్ కామెడీ యూనివర్స్‌కి ఒక ప్రేమకథ అవసరమైంది... దురదృష్టవశాత్తూ, అది చాలా రక్తపాతంతో కూడుకున్నది’’ అని చిత్ర బృందం ఈ సినిమా గురించి పేర్కొన్నారు. 2025 దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

'థామ' చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా, రష్మిక మందన్నలతో పాటుగా.. విలక్షణ నటులు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, పరేశ్‌ రావల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ లో దినేష్‌ విజన్‌, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. నిరేన్ భట్, సురేష్ మాథ్యూ, అరుణ్ ఫులారా రచయితలుగా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. 'పుష్ప: ది రైజ్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘గుడ్‌ బై’ అనే హిందీ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘మిషన్‌ మజ్ను’, ‘యానిమల్’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 'ఛావా' అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఛత్రపతి శివాజీ పెద్దకుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్కీ కౌశల్ కు జోడీగా కనిపించనుంది.

అలానే మురగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సికిందర్' సినిమాలో రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో తెరకెక్కుతున్న 'కుబేర' వంటి త్రిభాషా చిత్రంతో పాటుగా.. 'రెయిన్ బో', 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు 'థామ' మూవీలో నటించే అవకాశం అందుకుంది. ఇది తన కెరీర్ లోనే ఫస్ట్ హారర్ కామెడీ మూవీ. మరి ఈ సినిమాతో నేషనల్ క్రష్ నవ్విస్తూ బాలీవుడ్ ను భయపెడుతుందేమో చూడాలి.

Dinesh Vijan’s Horror Comedy Universe needed a love story... unfortunately, it's a bloody one. 💘

Brace yourselves for #Thama - Diwali 2025! 💥@ayushmannk #PareshRawal @Nawazuddin_S #DineshVijan @amarkaushik @AdityaSarpotdar @nirenbhatt @Suresh_Mathew_ #ArunFulara… pic.twitter.com/IvermO25F0

— Rashmika Mandanna (@iamRashmika) October 30, 2024
Tags:    
  • Thama 
  • Ayushmaan 
  • Rashmika 
  • Maddockfilms 
  • Bollywood 
  • Thamamovie 
  • Pareshrawal 
  • Dineshvijan 
  • Stree2 
  • Munjya 
  • Filmindustry 
  • Kubera 
  • Sikandar 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS