ఎవరు ఇవ్వలేనంత రెమ్యునరేషన్ ఇది!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జన నాయకన్ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్‌డేట్ బయటపడితే తమిళ నాటే కాదు, సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.;

Update: 2025-06-25 05:28 GMT

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న జన నాయకన్ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్‌డేట్ బయటపడితే తమిళ నాటే కాదు, సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను స్వీకరించిన KVN ప్రొడక్షన్స్, ఇటీవలి కాలంలో బిజినెస్ పరంగా భారీ అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి కన్నడలో డిస్ట్రిబ్యూషన్ బేస్ నుంచి పటిష్ట స్థితిలో నిలిచిన ఈ సంస్థ.. ఇప్పుడు నిర్మాణ రంగంలో కూడా టాప్ ప్లేస్‌ కోసం తీవ్రంగా ట్రై చేస్తోంది.

యశ్‌తో తెరకెక్కుతోన్న టాక్సిక్, లోకేష్ కనగరాజ్‌తో డీల్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో చర్చలు.. ఇవన్నీ ఒక్కసారి చూస్తే గమనించదగ్గ ఎత్తుగడలు. అందులో భాగంగా విజయ్‌కు ఇచ్చిన భారీ రెమ్యునరేషన్ కచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేయడంలో కచ్చితంగా సరిపోతుంది. విజయ్‌కు ఈ సినిమాకు రూ.275 కోట్లు రెమ్యునరేషన్ రూపంలో డైరెక్ట్‌గా చెల్లించారట.

ఎలాంటి షేర్ కట్ లేకుండా పూర్తిగా ఫుల్ల్ పేమెంట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది దక్షిణాదిన ఏ హీరోకూ ఇప్పటి వరకు లభించని రెమ్యునరేషన్ కావడం గమనార్హం. ఇంతవరకు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎక్కువగా ప్రాఫిట్ షేరింగ్ లేదా పార్షియల్ రెమ్యునరేషన్ మోడల్ మీద సినిమాలు చేయడం చూసాం. కానీ ఇక్కడ మాత్రం KVN వర్గాలు ముందస్తుగా అన్ని అమౌంట్లను చెల్లించడం.. వారికి మార్కెట్ మీద ఉన్న నమ్మకాన్ని అలాగే విజయ్ సినిమా మీద ఉన్న బిజినెస్ బలాన్ని చాటుతోంది.

అసలు విజయ్ నటిస్తున్న చివరి సినిమా అన్న బ్యాక్‌డ్రాప్‌, H.వినోత్‌ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్.. ఇవన్నీ కలవడంతో ఈ సినిమా ముందు నుంచి భారీ స్థాయిలో ఫైర్ అవుతోంది. క్రియేటివ్ లెవెల్‌లో ఏమి ఉన్నా, ఈ ప్రాజెక్ట్ మీద బడ్జెట్ లెక్కలు మాత్రం ఇండస్ట్రీకి కొత్త పాఠాలు చెబుతున్నాయి. కేవలం విజయ్‌కి రెమ్యునరేషన్ రూపంలో రూ.275 కోట్లు అంటే, మొత్తం బడ్జెట్, మార్కెటింగ్ కాస్ట్, డిజిటల్ రైట్స్ వేరు లెక్క.

దీన్ని బట్టి చూస్తే KVN ప్రొడక్షన్స్ అగ్ర నిర్మాణ సంస్థలైన హోంబాలే, మైత్రీ మూవీస్‌కు ప్రత్యర్థిగా ఎదగాలని సీరియస్‌గా చూస్తోందని అర్థమవుతుంది. ఇది కేవలం ఓ సినిమా కోసం కాకుండా.. భవిష్యత్తులో స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లకు తమ బ్యానర్‌పై ఓ సేఫ్ బెట్ అనే మెసేజ్ స్పష్టంగా ఇస్తోంది. అంతే కాకుండా, సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మ్యూజిక్, ట్రైలర్ అన్ని పాన్-ఇండియా లెవెల్లో రూపొందించి జనవరి 9, 2026 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఆ సమయానికి దేశవ్యాప్తంగా రాజకీయంగా కూడా విజయ్ ఎంట్రీ చేసే అవకాశం ఉండడంతో.. సినిమా మీద హైప్ మరింత పెరగనుంది. మొత్తానికి ఈ సినిమాతో విజయ్ సినిమా జర్నీ ముగుస్తుందా లేక రాజకీయ రంగంలోనూ సినిమా ప్రచారాన్ని బలంగా వాడుకుంటారా? అన్నది చూడాలి. కానీ KVN మాత్రం ఎవరు ఇవ్వలేని రెమ్యునరేషన్ కూడా మేం ఇస్తాం.. అని ఒక స్ట్రాంగ్ అనౌన్స్ మెంట్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది.

Tags:    

Similar News