విజయ్‌లో జనసేనాని కనిపిస్తున్నాడా?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం ఊహించని సమస్యలు, ఎదురు దెబ్బలు, అవమానాలు, కోర్టు కేసులు, సీబీఐ ఎంక్వైరీలతో సతమతమవుతున్నాడు.;
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం ఊహించని సమస్యలు, ఎదురు దెబ్బలు, అవమానాలు, కోర్టు కేసులు, సీబీఐ ఎంక్వైరీలతో సతమతమవుతున్నాడు. పార్టీ జెండాపై కూడా ఇప్పటి వరకు వివాదం నడుస్తోంది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది కూడా. ఇవి చాలవన్నట్టు కరూప్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ, భార్య సంగీత విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించడం.. విచారణ పూర్తయ్యే వరకు తనని విజయ్ నివాసంలోనే ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని మరో పిటీషన్ వేయడం..
ఇదే సమయంలో త్రిషతో సంబంధం ఉందని, గత కొన్నాళ్లుగా త్రిషతో కలిసి ఉంటున్నాడని ఆరోపణలు తలెత్తడం, వాటికి మరింత ఆజ్యం పోస్తూ విజయ్ చెన్నైలోని ఓ వివాహ రిసెప్షన్‌కు సంప్రదాయ డ్రెస్‌లో హాజరు కావడం, అదే చోట త్రిష కూడా కలవడం, ఇద్దరు కలిసి నూతన వధూవరులతో ఫొటోలకు పోజులివ్వడంతో వివాదం కాస్త మరింతగా ముదిరి నెట్టింట ట్రెండ్ అవుతోంది. తన చుట్టూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా విజయ్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఎన్ని పుకార్లు పుట్టించినా.. ఎంత మంది ఎలాంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేసినా ప్రజా సమస్యలు పార్టీ ముందు అవి పెద్ద సమస్యలు కావని ధీమా వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని తాను చూసుకుంటానని, అవి తనని ఏమీ చేయలేవని బలంగా చెబుతుండటంతో విజయ్ ధైర్యం ఏంటీ? తనని సమస్యలు, వివాదాలు చుట్టుముడుతున్నా తనలో ఎలాంటి బెరుకు, భయం కనిపించడం లేదని, ఇంత మొండిగా ఎందుకు మారాడని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా త్రిషతో కలిసి వివాహ రిసెప్షన్‌కు విజయ్ హాజరైన వీడియో నెట్టింట వైరల్ కావడంతో దళపతి ఏం చేస్తున్నాడో? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదని అభిమానులు వా పోతున్నారు.
విజయ్‌ని చుట్టుముడుతున్న సమస్యలని, వాటిపై ఆయన చూపిస్తున్న తెగువని చూస్తుంటే టాలీవుడ్ స్టార్ హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ కనిపిస్తున్నాడా? అంటే హండ్రెడ్‌కి హండ్రెడ్ పర్సెంట్ జనం నిజమనే చెబుతున్నారు. కారణం ఇద్దరి మధ్య చాలా వరకు సిమిలారిటీస్ కనిసిస్తున్నాయి కాబట్టి. పవన్ జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు ఇదే తరహాలో ఇంటా బయట సమస్యలని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. భార్య రేణూ దేశాయ్‌తో విడిపోవడం, దాన్నిటార్గెట్‌గా వాడుకుంటూ ప్రధాన పార్టీలు వ్యక్తిగత దాడులకు దిగడం, పరుశ పదజాలంతో దూశించడం తెలిసిందే.
పార్టీ ప్రచారాన్ని కూడా సరిగా చేసుకునే వీలు లేకుండా చేసినా.. ఎవరెన్ని అడ్డంకుల్ని కలిగించినా, వ్యక్తిగత సమస్యలు తనని మానసికంగా కృంగదీసినా వాటన్నింటికీ పవన్ భయపడలేదు. వెన్నుచూపి రాజకీయా నుంచి తప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ టైమ్ రెండు స్థానాల నుంచి ఒకేసారి పోటీ చేసి ఓటమిని చవిచూసినా మనకూ టైమ్ వస్తుందని ఆశగా ఎదురుచూసి అన్నట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 స్థానాల్లో విజయ దుందుభి మోగించి ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కావడం తెలిసిందే.
ప్రస్తుతం విజయ్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఇందుకు అద్దంపడుతోంది. పవన్ తరహాలోనే విజయ్ కూడా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. తనని ఎన్ని సమస్యలు వెంటాడినా? ఎవరెన్ని ఇబ్బందుల్ని క్రియేట్ చేసినా అడుగు వెనక్కి పడదని, ముందుకే సాగుతానని సంకేతాలిస్తున్నాడు. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఏప్రిల్ లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తే పవన్ తరహాలో విజయ్ తమిళ రాజకీయాల్లో చక్రం తప్పడం ఖాయం అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.