జన నాయగన్.. ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి..!

2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఈ సినిమా క్లైమాక్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్.;

Update: 2025-09-17 17:30 GMT

దళపతి విజయ్ లీడ్ రోల్ లో హెచ్. వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్. బాలయ్య భగవంత్ కేసరి సినిమా కథనే తీసుకుని విజయ్ పొలిటికల్ కెరీర్ కి కూడా ఉపయోగపడేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్దే నటిస్తుండగా ప్రేమలు బ్యూటీ మమితా బైజు కూడా నటిస్తుంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే ఈ సినిమా క్లైమాక్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్.

జన నాయగన్ క్లైమాక్స్..

జన నాయగన్ క్లైమాక్స్ ని హ్యూమనాయిడ్స్ అంటే రోబోలతో ఫైట్ ఉంటుందట. అది కూడా ఈసారి AI ఆధారిత రోబోస్ ని సిద్ధం చేస్తున్నారట. హ్యూమన్ వర్సెస్ ఏఐ రోబో ఇలాంటి ఫైట్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రాలేదని అంటున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంతా కూడా ఈ క్లైమాక్స్ తోనే సినిమా రేంజ్ పెంచేలా ప్లాన్ చేస్తున్నారట. జన నాయగన్ సినిమాను దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా చూస్తున్నారు.

ఈ సినిమా తర్వాత విజయ్ మళ్లీ సినిమాలు చేయడు కాబట్టి ఈ సినిమా రికార్డులను అలా కొన్నాళ్లు ఉండిపోయేలా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వినోద్ కూడా సినిమాను ఏమాత్రం అంచనాలను తగ్గకుండా చేస్తున్నాడట. జన నాయగన్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు యాక్షన్ సీన్స్ కూడా సినిమాకు మరో హైలెట్ అని అంటున్నారు. దళపతి విజయ్ మార్క్ మాస్ యాక్షన్ సినిమాగా ఇది వస్తుందట.

దళపతి విజయ్ డ్యాన్స్..

ఐతే ఇంటర్నల్ గా సినిమా చెప్పాల్సిన కథ చెప్పేస్తుందని టాక్. దళపతి విజయ్ కూడా జన నాయగన్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అటు పొలిటికల్ మీటింగ్స్ తో పాటు చివరి సినిమా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లా ఉండేలా చేస్తున్నారట. ఈ సినిమాలో సాంగ్స్ ఉంటాయా.. ఉన్నా దళపతి విజయ్ డ్యాన్స్ చేస్తారా అంటే కచ్చితంగా ఆ అంశాలు కూడా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తాయని అంటున్నారు.

విజయ్ జన నాయగన్ సినిమా తెలుగు రిలీజ్ చేయాలి అనుకున్నా కూడా ఆల్రెడీ సంక్రాంతికి తెలుగులో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటికి పోటీగా జన నాయగన్ వస్తుంది. తెలుగులో థియేటర్లు ఆశించిన స్థాయిలో దొరుకుతాయన్న ఆశ అయితే లేదు. మరి కోలీవుడ్ మీదే పూర్తి ఫోకస్ చేస్తే దళపతి విజయ్ జన నాయగన్ ఎంత మేరకు కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాలి. జన నాయగన్ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Tags:    

Similar News