జన నాయగన్.. ఆయన నోరు మూయించాడు మరి ఇప్పుడు..?
దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఐతే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.;
దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఐతే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హెచ్. వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి రీమేక్ గా వస్తుందని తెలుస్తుంది. జన నాయగన్ ట్రైలర్ చూస్తే దాదాపు అది కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఐతే భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం దాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతూ వచ్చారు.
దళపతి విజయ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్..
లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్ లోనే వీటీవీ గణేష్ దళపతి విజయ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అనిల్ రావిపూడికి వచ్చింది అంటూ జన నాయగన్ రీమేక్ పై హింట్ ఇచ్చాడు. ఐతే పక్కనే ఉన్న అనిల్ ఆయన ఆపమని అది వాళ్లు రీమేక్ అని అనౌన్స్ చేయాలి అని అన్నారు. ఐతే అనిల్ రావిపూడి రీసెంట్ ఇంటర్వ్యూస్ లో కూడా దీని గురించి చెప్పలేదు.
జన నాయగన్ ట్రైలర్ చూస్తే భగవంత్ కేసరి మూల కథకు విజయ్ పొలిటికల్ ఎజెండా నేపథ్యం తీసుకుని తెరకెక్కించారని తెలుస్తుంది. ఐతే అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో ఎందుకు అంత కన్ ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నది ఎవరికీ అర్ధం కావట్లేదు. ఐతే జన నాయగన్ ట్రైలర్ చూసిన వాళ్లు వీటీవీ గణేష్ అప్పుడే చెప్పాడు కదా అని అనుకుంటున్నారు.
భగవంత్ కేసరి రీమేక్ గానే జన నాయగన్..
అనిల్ రావిపూడి మాత్రం జన నాయగన్ తన సినిమా రీమేక్ అని ఎక్కడ చెప్పలేదు. ఆ సినిమా గురించి పూర్తి బాధ్యత వాళ్లదే కాబట్టి వాళ్లు ఎలా చేస్తారు ఎలా మార్చేస్తారు అన్నది వాళ్ల ఇష్టమే అని అనిల్ రావిపూడి అన్నారు. సో భగవంత్ కేసరి రీమేక్ గానే జన నాయగన్ వస్తుందని క్లియర్ గా తెలుస్తున్నా అనిల్ రావిపూడి ఈ కన్ ఫ్యూజ్ స్టేట్మెంట్స్ వెనక అసలు రీజన్ ఏంటన్నది ఆడియన్స్ కి అర్ధం కావట్లేదు.
ఐతే ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ సినిమాతో వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా స్పెషల్ క్యామియో రోల్ చేశారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తన హవా కొనసాగిస్తున్నారు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు తీసిన 8 సినిమాలు సక్సెస్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. మన శంకర వరప్రసాద్ తో డబల్ హ్యాట్రిక్ టార్గెట్ పెట్టుకున్నారు.