లేట్‌.. కొత్త తరహా పబ్లిసిటీ స్టంట్‌ కాదుగా?

చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు అన్ని చోట్ల ఇలాగే జరగడం మనం చూస్తున్నాం.;

Update: 2025-10-14 06:33 GMT

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సాహో సుజీత్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఓజీ' సినిమా ట్రైలర్‌ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. టెక్నికల్‌ ఇష్యూ కారణంగా ఓజీ ట్రైలర్‌ను ఆలస్యం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ బలవంతం చేస్తే ఈవెంట్‌లో ట్రైలర్‌ను స్క్రీనింగ్‌ చేయడం జరిగింది. కానీ యూట్యూబ్‌లో మాత్రం అనుకున్న సమయం కంటే చాలా గంటలు ఆలస్యంగా స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. ఓజీ ట్రైలర్‌కి జరిగినట్లుగానే ఈ మధ్య కాలంలో చాలా సినిమాల ట్రైలర్‌లకు, పాటలకు, టీజర్‌లకు జరగడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా నిన్న రెండు లేట్‌ అంటూ ప్రకటన రావడం ప్రేక్షకులకు అసహనంను కలిగించాయి. సిద్దు జొన్నలగడ్డ సినిమా తెలుసు కదా ట్రైలర్‌ను నిన్న ఈవెంట్‌లో స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది. ఆ వెంటనే యూట్యూబ్‌లో వదలాలి. కానీ యూట్యూబ్‌లో రావడానికి చాలా సమయం పట్టింది. అందుకు సరైన కారణంను మేకర్స్‌ చెప్పలేదు.

'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమా పాట

ఇక మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమా యొక్క మీసాల పిల్ల పాటను సైతం నిన్ననే విడుదల చేయాల్సి ఉంది. అక్టోబర్‌ 13 అంటూ చాలా రోజులుగా ప్రచారం చేస్తూ వచ్చారు. తీరా టైంకి మీసాల పిల్లను విడుదల చేయడంలో విఫలం అయ్యారు. మీసాల పిల్ల పాటకు లేట్‌ అవుతుందని, కొన్ని గంటలు ఆలస్యంగా అక్టోబర్‌ 14న విడుదల చేయబోతున్నట్లు చావు కబురు చల్లగా చెప్పడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఇలాంటి లేట్‌ వార్తలు ఏంటి అంటూ కొందరు ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇదే సమయంలో కొందరు సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇలా లేట్‌ చేయడం భాగం కాదు కదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా లేట్‌ చేయడం వల్ల మీడియా కవరేజ్ దక్కుతుంది. తద్వారా సినిమాకు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్‌ అవుతుందని ఇలా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్‌ లేట్‌

చిన్న హీరోల సినిమాల నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు అన్ని చోట్ల ఇలాగే జరగడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన అన్ని యూట్యూబ్‌ ద్వారా విడుదల చేయడం మనం చూస్తున్నాం. ట్రైలర్‌, టీజర్‌, పాటలను విడుదల చేయడానికి కనీసం వారం రోజుల ముందు ప్రకటన చేస్తారు. వారం రోజుల సమయం ఉన్నప్పటికీ ఆ లోపు ఫినిషింగ్‌ వర్క్‌ పూర్తి చేయలేక పోవడంను ఖచ్చితంగా దర్శకుడి అసమర్ధత అంటారు. కొందరు మ్యూజిక్‌ ఆలస్యం కావడం వల్ల వాయిదా వేస్తున్నామని అంటారు. తాజా లేట్‌ ఘటనలో ఖచ్చితంగా దర్శకుడు, సంగీత దర్శకుల తప్పు, అలసత్వం ఉన్నట్లు అనిపించడం లేదు. అది ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంట్‌ అనిపిస్తుందని కొందరు బలంగా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఇలాంటి వాటిపై పెద్దగా స్పందించే పరిస్థితి లేదు.

చిరంజీవి, నయనతార మీసాల పిల్ల పాట..

తెలుసు కదా సినిమా ట్రైలర్‌ లేట్‌ అయినప్పటికీ అదే రోజు అంటే నిన్న రాత్రి సమయంకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ఆలస్యం అయినా బాగుంది అంటూ ట్రైలర్‌ గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిద్దు నుంచి ఎలాంటి సినిమాను ప్రేక్షకులు ఆశిస్తారో అలాంటి సినిమా ఇది అన్నట్లుగా ట్రైలర్‌ ఉందని నెటిజన్స్ అంటున్నారు. ఇక మన శంకర వరప్రసాద్‌ గారు పాట విషయంలో మాత్రం మేకర్స్ నుంచి స్పష్టత రావడం లేదు. అక్టోబర్‌ 14 అంటూ నేటికి పాటను విడుదల చేయడం జరిగింది. పాటకు ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. వచ్చిన టీజర్‌తో పాట మరో రేంజ్‌లో ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.

వాయిదా పడటంతో పాట గురించి మరింత ఎక్కువ చర్చ జరిగి పాటకు మరింతగా బజ్ క్రియేట్‌ అయింది. పాట విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో మీసాల పిల్ల వ్యూస్‌తో రికార్డ్‌లను క్రియేట్‌ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముందు ముందు మరిన్ని లేట్‌ ప్రకటనలు వినాల్సి వస్తుందేమో. మరీ ఎక్కువగా లేట్‌ అయితే మాత్రం మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది అనేది మేకర్స్ తెలుసుకోవాల్సిన విషయం. పబ్లిసిటీ కోసమే లేట్‌ అయితే మాత్రం ఇలాంటి చీప్‌ పబ్లిసిటీ మానుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News