అంత్యాక్షరి నుంచి మాస్ నినాదాల దాకా…టాలీవుడ్‌లో కొత్త మాస్ ట్రెండ్

టాలీవుడ్‌లో ట్రెండ్స్ మారడం చాలా కామన్. ఒకప్పుడు 'గబ్బర్ సింగ్' సినిమాలో అంత్యాక్షరి సీన్ ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే.

Update: 2026-07-21 08:32 GMT

టాలీవుడ్‌లో ట్రెండ్స్ మారడం చాలా కామన్. ఒకప్పుడు 'గబ్బర్ సింగ్' సినిమాలో అంత్యాక్షరి సీన్ ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. దాని తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ ఫన్నీ సీన్స్ పెట్టారు. ఇప్పుడు సరిగ్గా అదే రూట్లో మరో కొత్త ట్రెండ్ నడుస్తోంది. సినిమాల్లో తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా మాస్ సాంగ్స్ పెట్టడం ఇప్పుడు మేకర్స్ కి లేటెస్ట్ ఫేవరెట్ అయిపోయింది..

గబ్బర్ సింగ్ సృష్టించిన అంత్యాక్షరి మేనియా:

2012లో పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ముఖ్యంగా విలన్ గ్యాంగ్‌తో హీరో కూర్చుని నడిపే అంత్యాక్షరి ఎపిసోడ్ థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. ఇక ఆ సినిమా తర్వాత తెలుగు తెరపై ఆ కామెడీ ట్రెండ్ బాగా ఊపందుకుంది. 'రేసుగుర్రం', 'మత్తు వదలరా', 'కిక్ 2' లాంటి చాలా సినిమాల్లో ఆ కోణంలోనే కొన్ని ఎంటర్‌టైనింగ్ సీన్స్ లేదా పాటలను ఇరికించారు. కథతో సంబంధం లేకపోయినా, జస్ట్ ఆడియన్స్‌ని నవ్వించడానికి ఆ ఫార్ములాను విపరీతంగా వాడేశారు. అవి హిట్ అయ్యాయి.

ఇప్పుడు తెలంగాణ మాండలికం, జానపదాల జోరు:

ఇప్పుడు సీన్ మొత్తం టోటల్లీ మారిపోయింది. 'ఫిదా', 'దసరా' లాంటి సినిమాలు ఇచ్చిన కిక్కుతో టాలీవుడ్‌లో తెలంగాణ యాస, మాండలికం, ఫోక్ బీట్స్ ఒక ఊపు ఊపేస్తున్నాయి. కేవలం కథ డిమాండ్ చేసినప్పుడే కాకుండా, కేవలం మాస్ అప్పీల్ కోసం, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ లేదా పెళ్లి పాటల కోసం తెలంగాణ స్టైల్ సాంగ్స్‌ను బలవంతంగా లాగుతున్నారు. రీసెంట్‌గా వచ్చిన ది ప్యారడైజ్ లో ఆయా షేర్ సాంగ్ సాన్సేషన్ తర్వాత ఈ జోరు మరింత పెరిగింది. రాబోయే పెద్ద హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కూడా ఇలాంటి తెలంగాణ సాంగ్స్ పక్కా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

కథ లేకపోయినా పర్వాలేదు, మజా ముఖ్యం:

సినిమాలో సిట్యువేషన్ ఉందా లేదా అనేదానితో సంబంధం లేకుండా, థియేటర్లలో ఈలలు వేయించడానికి మేకర్స్ ఈ తెలంగాణ నేటివిటీ ట్రెండ్‌ను తెగ వాడేస్తున్నారు. ఇక జానపద బాణీలు, ఊర మాస్ స్టెప్పులు ఉంటే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారనేది ఇండస్ట్రీలో ఇప్పుడు గట్టి నమ్మకం. చూడబోతే రాబోయే రోజుల్లో పెద్ద హీరోల సినిమాలన్నింటిలోనూ ఈ తెలంగాణ మాస్ టచ్ ఖచ్చితంగా కనిపిస్తుందని టాక్. మరి ఈ కొత్త ట్రెండ్ ఎంతకాలం ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News