మిరాయ్ వైబ్ అంతా ఆయన చేతుల్లోనే! ఆడియెన్స్ పల్స్ పట్టుకుంటారా?

యంగ్ హీరో తేజ స‌జ్జా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడాని మరో రెండు వారాల్లో రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజై మంచి స్పందన అందుకుంటుంది.;

Update: 2025-08-29 17:30 GMT

యంగ్ హీరో తేజ స‌జ్జా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడాని మరో రెండు వారాల్లో రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజై మంచి స్పందన అందుకుంటుంది. ఇందులో విజువల్స్, మేకింగ్ లో క్వాలిటీ హై లెవెల్ లో కనిపించింది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. కచ్చితంగా సినిమా చూడాలన్న ఆసక్తిని పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

అయితే ఈ ట్రైలర్ తోపాటుగా ఇటీవల మేకర్స్ వైబ్ ఉంది పిల్లా అనే ఒక పాటను సైతం విడుదల చేశారు. ఇది బాగా వైరల్ అవ్వడంతో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మ‌రో పాట కూడా ఉంది. త్వ‌ర‌లోనే ఈ పాటను కూడా విడుద‌ల చేస్తారు. అయితే ట్రైలర్ చూశాక.. ఇందులో పాటకు తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని అర్థం అవుతుంది. ఇది ఓన్లీ స్టోరీ బేస్ గా ఉండనుంది. అందుకే ఉన్న ఈ ఒకట్రెండు పాట‌లను కూడా ఎక్క‌డ అడ్జస్ట్ చేయాలో అర్థం కాక.. మేకర్స్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.

ఈ వైబ్ ఉంది పిల్లా పాట ఆడియో ప‌రంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఈ పాట థియేట‌ర్లో ఉంటుందా? లేదా? అనేది డౌటే. సినిమా ఫ్లో దెబ్బతీస్తుందని పాటను ఎడిటింగ్ లో తీసేయ్యాలని ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ఈ పాటన సినిమా మధ్యలోంచి కాకుండా.. ఆఖర్లో ఎండ్ టైటిల్స్ లో వేద్దామ‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ పాట సినిమాలో లేకుంటే.. ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతారేమోననే ఆలోచనా చేస్తున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆల్బ‌మ్ లో ఉన్న పాట‌ల‌న్నీ థియేట‌ర్లో ఉంటాయన్న నమ్మకం లేదు. ఒకటి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువైంది. సినిమా స్టోరీ ఫ్లో ను దెబ్బతీస్తుందని అనిపిస్తే.. పాటలే కాదు అనవసర సీన్లు కూడా ఎడిటింగ్ లో తీసేస్తున్నారు. అయితే ఇందులో ఒకపాట మాత్రం కచ్చితంగా ఫైనల్ కట్ లో తీసేస్తారని తెలుస్తోంది.

మరి అది వైబ్ ఉందే పిల్లా పాట‌నా? లేదంటే త్వరలో విడుద‌ల కాబోయే మ‌రో పాటానా? అనేది తేలియాల్సి ఉంది. ఎడిట‌ర్ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ సినిమాను పర్ఫెక్ట్ గా కట్ చేయాల‌ని చూస్తారు. ఒకసారి ఆయ‌న చేతిలోకి సినిమా వెళ్లిందంటే.. ఏ పాట ఉండాలి? ఏది తీసెయ్యాలి? అనేది ఆయ‌నదే ఫైనల్ డెసిషన్. అయితే ఇటీవల కాలంలో గేమ్ ఛేంజ‌ర్‌, కింగ్డ‌మ్ లో హిట్ట‌ైన పాట‌లు.. థియేట్రికల్ రన్ లో లేవు. దీంతో ఆడియెన్స్ నిరాశ చెందారు.

Tags:    

Similar News