తేజ సజ్జా 'మిరాయ్'.. మరో పని కూడా కంప్లీట్..

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీ ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-08 13:44 GMT

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో నటించిన మిరాయ్ మూవీ ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సూపర్ హీరో జోనర్ లో ఫాంటసీ థ్రిల్లర్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మూవీని రూపొందిస్తున్నారు.

రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం కీలక పాత్రలు పోషిస్తుండగా.. గౌర హరి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు.

అదే సమయంలో ఇప్పుడు మేకర్స్ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేశారు. యూ/ఏ సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో తేజ వేరే లెవెల్ లో ఉన్నారు. చేతిలో మంట ఉన్న కర్ర పట్టుకుని ఉండగా.. బ్యాక్ గ్రౌండ్ లో పవర్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

సినిమా రన్ టైమ్ ను 2 గంటల 49 నిమిషాలపాటు మేకర్స్ లాక్ చేశారు. అయితే మిరాయ్ మూవీలోని యాక్షన్ ఎలిమెంట్స్ కచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని మేకర్స్ చెబుతూ అంచనాలు పెంచుతున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీ హిట్ కొడతామనే నమ్మకంతో కూడా ఉన్నారు.

అయితే మిరాయ్ పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటి వరకు మేకర్స్ ఇచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే వేరే లెవెల్ లో అలరించింది. కచ్చితంగా మూవీ చూడాలనేంతగా హైప్ ను సృష్టించింది.

అలా మొత్తంగా సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందోనని.. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా, హనుమాన్ మూవీతో తేజ సజ్జా.. చివరగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు మిరాయ్ తో అంతే రేంజ్ లో విజయం సొంతం చేసుకునేలా కనిపిస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News