మిరాయ్.. ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత తేజనే..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా.. ప్రస్తుతం మిరాయ్ మూవీతో థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-21 05:59 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా.. ప్రస్తుతం మిరాయ్ మూవీతో థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సెప్టెంబర్ 12వ తేదీన రిలీజైంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఆ సినిమాలో తేజా సజ్జాతోపాటు రితికా నాయక్ లీడ్ రోల్ లో నటించారు. మంచు మనోజ్ విలన్ గా కనిపించారు. శ్రియ శరణ్, జగపతి బాబు, జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.

గౌర హరి మ్యూజిక్ అందించగా.. దర్శకుడే సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా చేపట్టారు. రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. వాటిని అందుకుని వరల్డ్ వైడ్ గా మిరాయ్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది.

రీసెంట్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన మిరాయ్.. తొలి వారానికి గాను రూ.112 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అలా ప్రస్తుతం మిరాయ్.. బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాల బాటలో పయనిస్తోంది. మేకర్స్ కు అదిరిపోయే ప్రాఫిట్స్ ను అందిస్తోంది.

అదే సమయంలో ఓవర్సీస్ లో మిరాయ్.. రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచి కూడా దూసుకుపోతోంది. ఆడియన్స్ ను విపరీతంగా థియేటర్స్ కు రప్పిస్తోంది. దీంతో భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. తద్వారా ఇప్పటి వరకు 2.5 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. సెకెండ్ వీకెండ్ లో మరిన్ని వసూళ్లు సాధించేలా ఉంది.

అయితే తేజ సజ్జా నటించిన గత మూవీ హనుమాన్ మూవీ కూడా అప్పట్లో ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్ల మార్క్ ను టచ్ చేసింది. ఇప్పుడు మిరాయ్ కూడా ఆ ఫీట్ అందుకుంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఆ మార్క్ టచ్ చేసిన హీరోల జాబితాలో తేజ సజ్జా చేరారు. అంతే కాదు బడా హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సరసన నిలిచారు.

ఇప్పటి వరకు డార్లింగ్, తారక్ కే ఆ ఘనత సాధ్యమైంది. వరుస సినిమాలతో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ ను వారిద్దరూ ఇప్పటికే టచ్ చేశారు. ఇప్పుడు తేజ కూడా ఆ ఘనత అందుకుని సత్తా చాటారు. దీంతో ఆ లిస్ట్ లో ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత తేజనే ఉన్నారు. ఈ నేపథ్యంలో TUPAKI యంగ్ హీరోకు బెస్ట్ విషెస్ చెబుతోంది.

Tags:    

Similar News