మిరాయ్ బాక్సాఫీస్ హవా.. మరోసారి 100 కోట్ల క్లబ్‌లో తేజ సజ్జా

ఇప్పటికే హనుమాన్ తో రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న తేజ ఇప్పుడు మిరాయ్ తో మరో మైల్ స్టోన్ ను సొంతం చేసుకున్నాడు.;

Update: 2025-09-17 06:36 GMT

తెలుగు సినిమాల్లో బాక్సాఫీస్ హంగామా మళ్లీ మిరాయ్ రూపంలో కనిపిస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి రోజు కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. విడుదలైనప్పటి నుంచి హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్న ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే హనుమాన్ తో రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న తేజ ఇప్పుడు మిరాయ్ తో మరో మైల్ స్టోన్ ను సొంతం చేసుకున్నాడు.

ప్రత్యేకంగా 5 రోజులు పూర్తికావడానికి ముందే మిరాయ్ 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఇంత భారీ వసూళ్లు సాధించడం స్టార్ హీరోలకే సాధ్యమవుతుందని భావిస్తారు. కానీ తేజ సజ్జా మాత్రం తన కష్టానికి, తన ఎంపిక చేసిన కంటెంట్‌కి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. యాక్షన్, ఫాంటసీ, సూపర్ హీరో జానర్‌ కావడంతో మిరాయ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఊహించని రీతిలో దూసుకుపోతోంది. కేవలం 5 రోజుల్లోనే మిరాయ్ 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేయడం అరుదైన ఘనత. హనుమాన్ తర్వాత వరుసగా మరోసారి తేజ సజ్జా ఈ రికార్డును నమోదు చేయడం ఆయన పెరుగుతున్న మార్కెట్‌కి నిదర్శనం. ఇక ఇండియాలో అయితే మంగళవారం ఒక్క రోజే ఒక లక్షకు పైగా టిక్కెట్లు బుక్ కావడం సినిమాపై ఉన్న డిమాండ్‌ని స్పష్టంగా చూపిస్తోంది.

ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నట్లు, మిరాయ్ విజయానికి ప్రధాన కారణం తేజ సజ్జా డెడికేషన్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విజువల్ ట్రీట్, నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ పెట్టిన భారీ కృషి అని అంటున్నారు. ఈ ముగ్గురి విజన్ వల్లే ఈ సినిమా సాధారణ కమర్షియల్ సినిమాలకన్నా విభిన్నంగా నిలిచి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని పేర్కొంటున్నారు.

అలాగే మనోజ్ మంచు విలన్ పాత్రలో చేసిన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కూడా సినిమా బలంగా నిలిచేలా చేసింది. ఆయన ఎనర్జీ తేజ సజ్జా పాత్రకి సరైన బ్యాలెన్స్ ఇచ్చింది. ఈ ఇద్దరి మధ్య స్క్రీన్‌పై కనిపించిన కాంపిటీషన్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫాంటసీ ఎలిమెంట్స్ మిరాయ్‌ని పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్‌గా మార్చాయి. మొత్తం మీద, మిరాయ్ విజయంతో తేజ సజ్జా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా రెండు పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త తరహా సూపర్ హీరోని పరిచయం చేశాడు. ఇప్పుడు 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన మిరాయ్, రాబోయే రోజుల్లో మరెన్ని రికార్డులను బద్దలుకొడుతుందో చూడాలి.

Tags:    

Similar News