హనుమాన్ 3డీ కోసం భారీ ప్లాన్.. ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్!
సూపర్ హీరో సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే భారతీయ పురాణాల స్పూర్తితో తెరకెక్కిన హను మాన్ సినిమా మాత్రం ఆ జానర్‌ను కొత్త స్థాయిని తీసుకెళ్లింది.
సూపర్ హీరో సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అయితే భారతీయ పురాణాల స్పూర్తితో తెరకెక్కిన హను మాన్ సినిమా మాత్రం ఆ జానర్‌ను కొత్త స్థాయిని తీసుకెళ్లింది. చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు మరింత భారీ అనుభూతితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ హీరో తేజ సజ్జ హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ విజువల్ వండర్ జూన్ 25, 2026న 3డీ వెర్షన్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది.
ఇప్పటికే నేషనల్ అవార్డు అందుకుని, బాక్సాఫీస్ వద్ద అద్భుత రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు మరింత గ్రాండియర్‌గా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా భారీ స్క్రీన్‌లపై 3డీ ఫార్మాట్‌లో ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కీలకమైన సినిమాగా నిలిచిన హను మాన్ ను మళ్లీ థియేటర్లలో చూడాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటుండగా, ఇప్పుడు ఆ కోరిక మరింత స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ రూపంలో నెరవేరబోతోంది.
భారతీయ పురాణాలు, ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్, సూపర్ హీరో ఎలిమెంట్స్‌ను కలిపి రూపొందించిన హను మాన్ మొదటి రిలీజ్ టైమ్ లోనే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు 3డీ వెర్షన్ కోసం చిత్ర బృందం పలు టెక్నికల్ డెవలప్‌మెంట్స్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, హను మాన్ శక్తులను చూపించే విజువల్స్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు 3డీలో మరింత థ్రిల్లింగ్‌గా కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. హీరో తేజ సజ్జ నటనకు అప్పట్లో ప్రశంసలు దక్కగా, ఈసారి అతని సూపర్ హీరో అవతారం మరింత ఎలివేటెడ్‌గా కనిపించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. హీరోయిన్ అమృత అయ్యర్ తన సహజ నటనతో కథలో భావోద్వేగాలను బలంగా మోసుకెళ్లగా, వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర సినిమాకు మరింత బలం చేకూర్చింది. మరోవైపు విలన్‌గా వినయ్ రాయ్ చూపించిన క్రూరత్వం, అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచాయి. ఈ పాత్రలన్నీ ఇప్పుడు 3డీ ఫార్మాట్‌లో మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. మ్యూజిక్ డైరెక్టర్ గౌరా హరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అప్పట్లో థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించగా, ఇప్పుడు డాల్బీ సౌండ్‌తో కూడిన 3డీ ఎక్స్‌పీరియెన్స్ లో అది నెక్ట్స్ లెవెల్ కు వెళ్లనుంది. ప్రతి యాక్షన్ బ్లాక్, ప్రతి ఎమోషనల్ సీన్ ఆడియన్స్ ను పూర్తిగా కథలో ముంచెత్తేలా సౌండ్ డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ రీ రిలీజ్‌ను కేవలం సాధారణ విడుదలగా కాకుండా ఓ థియేట్రికల్ ఈవెంట్‌లా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో హనుమాన్ 3డీ పోస్టర్లు, టీజింగ్ విజువల్స్ వైరల్ అవుతుండగా, అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. థియేటర్లలో మళ్లీ ఆ భక్తి, ఆ విజువల్ గ్రాండియర్, ఆ సూపర్ హీరో ఎమోషన్‌ను ఆస్వాదించేందుకు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.