• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ మోషన్ పోస్టర్...

ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్.. చరిత్రలో తొలిసారి అలా..

| సోషల్‌ మీడియాలో విడుదల చేయకముందు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని 'వెంప కాశీ కోడి పందెం బరి'లో భారీ ఎల్ఈడీ తెరపై ప్రభాస్‌ డిజిటల్‌ లుక్‌ ను ప్రదర్శించారు మేకర్స్.

By - Tupaki Desk
Update: 2024-01-15 06:26 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం డైరెక్టర్ మారుతితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ తోపాటు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను మేకర్స్.. సంక్రాంతి కానుకగా ఈరోజు ఉదయం ప్రకటించారు. డార్లింగ్ ఫ్యాన్స్ లో సంక్రాంతి జోష్ ను రెట్టింపు చేశారు. రాజా సాబ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంది.


సోషల్‌ మీడియాలో విడుదల చేయకముందు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని 'వెంప కాశీ కోడి పందెం బరి'లో భారీ ఎల్ఈడీ తెరపై ప్రభాస్‌ డిజిటల్‌ లుక్‌ ను ప్రదర్శించారు మేకర్స్. ఇలా చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రభాస్‌ కటౌట్‌ ను చూసేందుకు గ్రౌండ్స్ కు అభిమానులు, ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డార్లింగ్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ అప్డేట్ బయటకు వచ్చినా భీమవరం దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది.

లుంగీలో ప్రభాస్ వింటేజ్‌ లుక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. డిజిటల్ తెరపై ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తున్న వీడియాను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. స‌లార్‌ లో ప్ర‌భాస్ లుక్‌ కు ఇది చాలా భిన్నంగా ఉంద‌ని, ఫ్యామిలీ లుక్స్‌ లో వింటేజ్ ప్ర‌భాస్‌ను చూసినట్టుగా ఉంద‌ని అభిమానులు హ్యపీగా ఫీల‌వుతున్నారు.

డార్లింగ్, బుజ్జిగాడు సినిమాల్లోలాగా వింటేజ్ ప్రభాస్ను రాజా సాబ్లో చూస్తారని దర్శకుడు మారుతి ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ లుంగీలో కనిపించారు. ఈ సినిమాలో యాక్షన్ మోడ్ లో కాకుండా కూల్ గా, కామెడీ టైమింగ్ తో డార్లింగ్ అలరించనున్నట్లు తెలుస్తోంది.

ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌ గా ఈ సినిమాను గతేడాది ప్రారంభించారు మారుతి. ఈ కాంబినేషన్‌పై ఇంతకాలం అధికారిక ప్రకటన కూడా వెలువడకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సినిమా నేపథ్యం, టైటిల్‌పై పలు రూమర్స్‌ వచ్చాయి. రెండు పార్ట్ లుగా తెరకెక్కే అవకాశాలున్నాయనే టాక్‌ కూడా వినిపించింది.

ఇక దర్శకుడు మారుతి సినిమా అంటే మినిమమ్ కామెడీ ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ప్రభాస్ కు జోడీగా నటించనున్న హీరోయిన్ ఎవరో ఇంకా తెలియలేదు. హీరోయిన్ల డిటైల్స్ ను సీక్రెట్ గానే ఉంచారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు సహ హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీతో పాటు ప్రభాస్.. కల్కి 2898 ఏడీ సినిమాలోనూ నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

Tags:    
  • Tollywood 
  • Maruthi 
  • Movie 
  • Therajasaab 
  • Prabhas 
  • Panindia 
  • Ledcutout 
  • Filmindustry 
  • Peoplemediafactory 

Similar News

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS