• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆఫర్‌ : మిస్టర్ బచ్చన్‌...

ఆఫర్‌ : మిస్టర్ బచ్చన్‌ తో రాజా సాబ్‌..!

| మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.

By - Tupaki Desk
Update: 2024-08-14 11:07 GMT

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. మరి కొన్ని గంటల్లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మిస్టర్ బచ్చన్‌ రెడీగా ఉన్నాడు.పెయిడ్ ప్రీమియర్‌ షో లను భారీ ఎత్తున వేసేందుకు గాను మేకర్స్ ప్లాన్‌ చేశారు. సినిమాపై నమ్మకంతో పెయిడ్‌ ప్రీమియర్‌ లకు సిద్ధం అయ్యాం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా తో చెప్పుకొచ్చారు.పెయిడ్ ప్రీమియర్‌ షో లకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో భారీ ఓపెనింగ్‌ కలెక్షన్స్ ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో మిస్టర్ బచ్చన్ సినిమా నిర్మాణం జరిగింది. ఇప్పుడు అదే బ్యానర్ లో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రాజాసాబ్‌ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇటీవల రాజాసాబ్ సినిమా గ్లిమ్స్ వచ్చాయి. ఆ గ్లిమ్స్ ను మిస్టర్ బచ్చన్‌ ప్రింట్‌ కి జత చేసి అన్ని థియేటర్లలో ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి అంటూ సమాచారం అందుతోంది. మాస్ రాజా రవితేజ సినిమా చూడ్డానికి వెళ్లిన వారికి బంపర్‌ ఆఫర్ అన్నట్లుగా వెండి తెరపై ప్రభాస్ ను రాజాసాబ్‌ రూపంలో చూపే అవకాశం దక్కబోతుంది.

ప్రభాస్ గత చిత్రం కల్కి మరియు అంతకు ముందు చిత్రం సలార్ లు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో రాజా సాబ్‌ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. అందుకు తగ్గట్లుగా దర్శకుడు మారుతి చాలా సమయం తీసుకుని మరీ సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా విడుదల తేదీ విషయమై సస్పెన్స్ నెలకొంది. మిస్టర్ బచ్చన్ విడుదల తర్వాత అయినా పీపుల్స్ మీడియా వారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మిస్టర్‌ బచ్చన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే రాజా సాబ్ కి అంతకు మించి బడ్జెట్‌ పెట్టేందుకు పీపుల్స్ మీడియా రెడీ అనే అవకాశాలు లేకపోలేదు.

ప్రభాస్‌, మారుతి కాంబో మూవీ అనగానే చాలా మంది మొదట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభాస్ వంటి పాన్‌ ఇండియా స్టార్‌ తో మారుతికి సినిమా చేసే సత్తా లేదు, ఆ స్థాయి కూడా కాదు అంటూ చాలా ఘోరంగా విమర్శలు చేసిన వారు ఇప్పుడు వీరి కాంబో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తూ ఉన్న ప్రభాస్‌ హ్యాట్రిక్ ను రాజా సాబ్‌ సినిమాతో అందుకుంటాడా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ప్రభాస్ నటించబోతున్న సలార్‌ 2 మరియు కల్కి 2 లు ఇంకా హను రాఘవపూడి సినిమా లు కూడా వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Tags:    
  • Rajasaab 
  • Prabhas 
  • Peoplemediafactory 
  • Mrbachchan 
  • Raviteja 
  • Harishshankar 
  • Tgvishwaprasad 
  • Paidpremiers 
  • Kalki 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS