ఆ డైరెక్టర్‌కి VD దొరికే ఛాన్స్ లేదా..?
ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేసిన డైరెక్టర్లకు పేరొచ్చిన తరువాత హీరోలు డేట్స్ ఇవ్వడం, తిరిగి మరో సినిమా చేయడం అనేది ఒక్కో సారి ఈజీగా జరిగిపోతుంటుంది.;
ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేసిన డైరెక్టర్లకు పేరొచ్చిన తరువాత హీరోలు డేట్స్ ఇవ్వడం, తిరిగి మరో సినిమా చేయడం అనేది ఒక్కో సారి ఈజీగా జరిగిపోతుంటుంది. అయితే ఒక్కోసారి అది అంత ఈజీ కాదు. దీంతో సదరు హీరో కోసం డైరెక్టర్ వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితిని దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎదుర్కొంటున్నాడట. ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. `ఎవడే సుబ్రమణ్యం` సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత `పెళ్లి చూపులు` మూవీతో హీరోగా అరంగేట్రం చేయడం తెలిసిందే.
తరుణ్ భాస్కర్‌కు కూడా దర్శకుడిగా ఇదే తొలి సినిమా. 2016లోవిడుదలైన ఈ మూవీ బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ డైలాగ్స్ విభాగంలో నేషనల్ అవార్డుల్ని దక్కించుకుంది. అంతేనా బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్, నంది పురస్కారాల్ని సొంతం చేసుకుని దర్శకుడు తరుణ్ భాస్కర్‌ని, హీరో విజయ్ దేవరకొండని పాపులర్ అయ్యేలా చేసింది. ఈ మూవీ తరువాత ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ కలిసి పనిచేయలేదు.
ఆ తరువాత విజయ్ దేవరకొండ `అర్జున్‌రెడ్డి`తో స్టార్ అయ్యాడు. వరుసగా క్రేజీ సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హీరోగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. `లైగర్`తో కాస్త వెనకబడినా `కింగ్‌డమ్`తో మళ్లీ బౌన్స్ బ్యాక్ కాబోతున్నాడు. దీనితో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించడానికి రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ `కల్కి 2`లోనే అర్జునుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. రౌడీ హీరో విజయ్ కెరీర్ ఇలా ఉంటే తరుణ్ భాస్కర్ మాత్రం ఇన్నేళ్లైనా `పెళ్లిచూపులు` దగ్గరే ఆగిపోయాడు.
చిన్న చిన్న సినిమాలు చేస్తూ బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మరోసారి తరుణ్ భాస్కర్ సినిమా చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్న రౌడీ స్టార్ తరుణ్ భాస్కర్‌కి దొరికే ఛాన్స్ ఎక్కడా కనిపించడం లేదు. ఒక వేళ `వీడీ` ఛాన్స్ ఇవ్వాలనుకున్నా రాహుల్ సంక్రీత్యన్, రౌడీ జనార్థన్ చిత్రాల తరువాతే అని అంత వరకు ఆగాలంటే తరుణ్ భాస్కర్ మరో ఏడాదికి పైనే రౌడీ హీరో కోసం ఎదురు చూడక తప్పదని ఇన్ సైడ్ టాక్.